ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడప్ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రమేయం ఉన్న వారిని ఒక్కొక్కిరిని ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతోంది. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్‌ఎన్ రెడ్డి త్వరలోనే ఈడీ ముందు హాజరు కాబోతుండగా.. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరయ్యారు. అలాగే ఈ నెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి హెచ్‌ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ తాత్కాలిక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
కేటీఆర్ అరెస్ట్ అంశం కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పటికే ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు నమోదుకాగా, గవర్నర్ నుంచి విచారణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో..కేసు మరింత వేడెక్కింది. ఫార్ములా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ డిసెంబర్ 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కేసులో కేటీఆర్ అప్పట్లో మున్సిపల్ కార్పొరేషన్ మంత్రిగా లేఖపై సంతకం చేయడం వల్లే హెచ్‌ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని.. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది. తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయకూడదని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇలాంటి సమయంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ తో పాటు, ఈ కేసులో అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 7న వారు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
సిన విషయం తెలిసిందే.
ఇటు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ సమన్లను పంపింది. దీంతో ఈ నెల 6న ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్..ఆ తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరవుతారా లేక మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఏసీబీ సేకరించిన ఆధారాలను తీసుకుని ఈడీ విచారణ జరపాల్సి ఉంది. దీంతో ఏసీబీ విచారణ తర్వాత అవే ఆధారాలతో ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. విచారణలో ఈడీ, ఏసీబీకి అనుకూలంగా విషయాలు వెల్లడి అయితే మాత్రం కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.