యాదాద్రి ఆలయ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌

Telangana BJP Chief Bandi Sanjay Responds Over Minister KTR Remarks on Yadadri Temple Development,Telangana BJP Chief Bandi Sanjay,Responds Over Minister KTR,Minister KTR Remarks,Minister KTR Remarks on Yadadri Temple,Yadadri Temple Development,Remarks on Yadadri Temple Development,Mango News,Mango News Telugu,Yadadri Temple Development Authority,Yadadri Temple Development,Yadadri Temple Development Latest News,Yadagirigutta Temple Development Authority Yadadri Bhuvanagiri Telangana,Yadadri Temple Distance,Yadadri Temple Jobs,Is Yadadri Temple Open Today,Yadadri Temple Opening Date,Yadadri Temple Latest Developments,Yadadri Temple Opening Times

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయం వేదికగా తెలంగాణ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద వహించి పండితుల సలహా మేరకు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి పూనుకొని భారీగా నిధులు కేటాయించి తిరుమల తరహాలో పునర్మించారు. దీనిపై పలువురు రాష్ట్ర నేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో మంత్రి కేటిఆర్ దావోస్ వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ యదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిన విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా స్పందించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడి.. పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని మంత్రి కేటీఆర్ చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి కూడా పెట్టుబడేనా, భక్తుల విరాళాల కోసమే అభివృద్ధి చేశారా అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు హిందూ ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడం ఎలా అన్నది చూపించడం కోసమే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 19 =