జన్వాడ ఫామ్ హౌస్ కేసును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే రాయదుర్గంలోని రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర పాకాల ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వారి అడ్డుకున్నారు. సోదాల్లో విల్లా నంబర్ 5, 40,43లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 53 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. ఈ కేసులో రాజ్ పాకాల ఏ1గా ఉండగా.. విజయ్ మద్దూరి ఏ2గా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ మద్దూరికి పోలీసులు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు. కాగా రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించారని, 7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, అందులో కర్ణాటక మద్యంతో పాటు విదేశీ లిక్కర్ కూడా ఉందని ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు.ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ రాజ్ పాకాలను పోలీసులు ఎందుకు వదిలేశారని అనుమానాలు వస్తున్నాయి.
22 మందికి డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూరి డ్రగ్స్ (కొకైన్) తీసుకున్నట్లు తేలింది. తనకు డ్రగ్స్ ను ఇచ్చింది రాజ్ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్ మద్దూరి వెల్లడించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎస్టీపీఎస్) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో A1 రాజ్ పాకాలా, A2గా విజయ్ మద్దూరి కావడం గమనార్హం. విజయ్ మద్దూరి నేడు పోలీస్ విచారణకు హాజరు కానున్నాడు.
కాగా గత శనివారం రాత్రి జన్వాడ ఫౌమ్ హౌస్ లో భారీ శబ్దాలు వస్తున్నట్లు డయల్ 100 కు కాల్ వచ్చింది. దీంతో ఓ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ భారీగా లగ్జరీ కార్లు కానిపించాయి. భారీ శబ్దాలు కూడా వచ్చినట్లు గుర్తించి వెంటనే ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. అక్కడ భారీగా విదేశీ మద్యంతో పాటు క్యాసిన్ ఆడుతున్నట్లుగా గుర్తించారు. పార్టీలో మహిళలు, పురుషులు ఉన్నారు. వీరంతా ప్రముఖులుగానే తెలుస్తోంది.