ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ లో మహాగణపతి దర్శనం కోసం భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు, అలాగే నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు. కాగా ఇకపై విగ్రహ ఏర్పాటు, నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. మండపంలో 70 అడుగుల ఎత్తయిన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అలాగే వచ్చే ఏడాది నుంచి మండపంలోనే విగ్రహ నిమజ్జనం కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఇటీవలే రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నిమజ్జనం కార్యక్రమంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ