తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలన మార్పులు.. మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో కొత్త దిశ

Major Reforms In Telangana Congress Under Meenakshi Natarajans Leadership, Major Reforms In Telangana Congress, Telangana Congress Under Meenakshi Natarajans Leadership, Meenakshi Natarajans Leadership, Leadership Decisions, Meenakshi Natarajan, Party Reforms, PCC Committee, Telangana Congress, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, కాంగ్రెస్‌ను కొత్త దిశగా నడిపిస్తున్నారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) రాష్ట్ర కార్యవర్గం ఎంపికలో సంచలన మార్పులు చేపట్టారు.

పీసీసీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుల ఎంపికలో ఎలాంటి రాజీకి తావులేకుండా ఉండాలని మీనాక్షి స్పష్టంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్న ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. జిల్లాల వారీగా అర్హులైన నాయకుల జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా, అనుభవం ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టం చేశారు.

ఇందుకోసం ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న వారికి మాత్రమే అవకాశం దక్కేలా చర్యలు తీసుకున్నారు. పీసీసీ కార్యవర్గ సభ్యత్వానికి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడు నెలలుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఎంపిక పూర్తిగా పనితీరును ఆధారంగా చేసుకొని ఉంటుందని మీనాక్షి స్పష్టం చేశారు.

నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని మీనాక్షి సూచించారు. జిల్లాల వారీగా అర్హులైన నేతలను గుర్తించి, వారి పేర్లను నివేదిక రూపంలో సమర్పించాలని పీసీసీ నుంచి ఇప్పటికే ఇన్‌ఛార్జి మంత్రులకు సమాచారం అందింది. ఈ జాబితాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు సమీక్షించి, తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం, ఈ లిస్టును కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం కోసం పంపనున్నారు.

ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొననున్నారు. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించే నేతలపై ఆమె ప్రత్యేకంగా చర్చించనున్నారు. కేవలం పైరవీల ద్వారా పదవులు కట్టబెట్టే విధానం ఇక ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలతో పీసీసీ పనితీరులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ, నిబద్ధత, న్యాయమైన ఎంపిక విధానం అమలవుతుందనే నమ్మకాన్ని మీనాక్షి నటరాజన్ కలిగిస్తున్నారు.