కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ భేటీ

Praja Shanti Party President Dr KA Paul Meets Union Home Minister Amit Shah at Delhi, Dr KA Paul Meets Union Home Minister Amit Shah at Delhi, Praja Shanti Party President Dr KA Paul, PSP President Dr KA Paul, Dr KA Paul, Praja Shanti Party President, Praja Shanti Party, KA Paul Meets Union Home Minister Amit Shah, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Minister Amit Shah, Union Home Minister, Amit Shah, PSP President News, PSP President Latest News, PSP President Latest Updates, PSP President Live Updates, Mango News, Mango News Telugu,

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ గురువారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా కేఏ పాల్ పై ఓ యువకుడు చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో భద్రతా విషయంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో అమిత్ షాతో కేఏ పాల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ, కేవలం తనపై జరిగిన దాడి గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని, చాలా విషయాలు మాట్లాడడానికి వచ్చానన్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించామని, త్వరలోనే ప్రధాని మోదీని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంశాలు, శ్రీలంక ఆర్ధిక సంక్షోభం గురించి చర్చించామని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గమని కేఏ పాల్ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో తనపై జరిగిన దాడిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళి, బాద్యులపై చర్యలు తీసుకోవాలని, తనకు సెక్యూరిటీ పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కేఏ పాల్ కోరినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here