తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు హైదరాబాద్ లో నాలుగు చోట్ల, మహబూబ్ నగర్ లో మూడు చోట్ల డ్రైరన్ (కరోనా వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ, సన్నద్ధతపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. “ఇప్పటికే 10 వేల మంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే డాక్టర్లు కావొచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావొచ్చు, వివిధ హోదాలలో ఉండే స్టాఫ్ కావొచ్చు వాళ్ళందరూ ట్రైనింగ్ పొంది ఉన్నారు. గతంలో ఇలాంటి వ్యాక్సిన్ లో ఎలాంటి ప్రాక్టీస్ ఉండేదో అది ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది” అని మంత్రి పేర్కొన్నారు.
రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్ధ్యం తెలంగాణలో ఉంది:
ఒక రోజుకు పదివేల మంది పాల్గొని పది లక్షల మందికి వ్యాక్సిన్ చేయగలిగే సామర్ధ్యం తెలంగాణలో ఉంది. డ్రైరన్ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ఒక 5 లక్షల డోసులు ఇస్తారని ఇండికేట్ చేసినట్లుగా తెలుస్తోంది. తర్వాత మళ్ళీ ఒక 10 లక్షలు, దాని తరువాత ఒక కోటి వ్యాక్సిన్ డోసులు ఇవ్వనున్నట్టు కేంద్రప్రభుత్వం నుంచి సమాచారం ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దాని బట్టి ముందుగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకి, తరువాత హోమ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ సిబ్బంది, అలాగే ఎక్సపోజర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ముందుగా వ్యాక్సిన్ అందిస్తాం. అనంతరం పేదవారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ఆస్కారం ఉంది” అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ