వ్య‌క్తిగ‌త శుభ్ర‌తతో పాటు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి – మంత్రి ఈటల

AP Coronavirus, ap coronavirus cases today, COVID-19, MLA Pendem Dorababu, MLA Pendem Dorababu Tests Positive, Pendem Dorababu Tests Positive, Pithapuram MLA, Pithapuram MLA Pendem Dorababu, Pithapuram MLA Pendem Dorababu Tests Positive, Pithapuram MLA Pendem Dorababu Tests Positive for Covid-19

వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌ పాటించడంతో పాటుగా ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్ అన్నారు. సెప్టెంబర్ 4, శ‌నివారం నాడు త‌న క్యాంపు కార్యాల‌యంలో సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన వారికి డెంగ్యు, మ‌లేరియా, చికెన్‌గున్యా సహా ఇత‌ర కీట‌క జ‌నిత అంటువ్యాధులు త‌గ్గించ‌టానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇంటి ప‌రిస‌రాల్లో నీటి నిల్వ‌లు లేకుండా చూసుకోవాల‌ని తెలిపారు. గ‌త సంవ‌త్స‌రంతో పోల్చితే ఈ సంవ‌త్స‌రం డెంగ్యు, మ‌లేరియా, చికెన్‌గున్యా ఇత‌ర‌ కీట‌క‌జ‌నిత అంటు వ్యాధులు త‌గ్గాయ‌ని తెలిపారు. క్యాంపు కార్యాల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌లో గంబూసియా చేప‌ల ప‌నితీరు, బ‌యలాజిక‌ల్ కంట్రోల్ ద్వారా లార్వాను తినే విధానాన్ని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. ఎగ్జిబిష‌న్‌లో వివిధ ర‌కాల దోమ‌ల‌ను ప‌రిశీలించారు. దోమ‌ల వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల గురించి చీఫ్ ఎంట‌మాల‌జిస్ట్ డా.రాంబాబును అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ప్రారంభించిన ప్ర‌తి ఆదివారం 10గంట‌ల‌కు 10 నిమిషాల కార్య‌క్ర‌మం పోస్ట‌ర్‌, క‌ర‌ప‌త్రాన్ని విడుద‌ల చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu