
టీపీసీసీ చీఫ్ నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. 20 రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న అధిష్టానం.. కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని తుది చర్చల తర్వాత ఓ కొలిక్కి తీసుకువచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బలరాం నాయక్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలించిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశమివ్వాలని మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరగా… అన్ని ప్రతిపాదనలను పరిశీలించి వారిలో ఒకరిని టీపీసీసీ చీఫ్‌గా జులై ఆరో తేదీలోగా ప్రకటిస్తారని గాంధీ భవన్‌లో టాక్ నడుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూర్చుని మాట్లాడటానికి రెడీ అవుతోంది. దీనికోసం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. మహేశ్‌కుమార్ గౌడ్ వైపే అధిష్టానం ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్‌కు అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్‌లో స్థానాన్ని కల్పించడంతో.. లంబాడా సామాజికవర్గానికి కూడా తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కోటాలోనే బాలూనాయక్ పేరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ బాలూనాయక్‌కు కానీ మంత్రి పదవి లభిస్తే.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అయిన మల్‌రెడ్డి రంగారెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే నల్లగొండ జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సైతం మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపై కూడా ఈ రోజు చర్చల్లో క్లారిటీ రానుంది.
ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా తన పేరును పరిశీలించాలని .. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ కోరారు. దీనికోసం జులై 2న ఢిల్లీలో ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేశారు. అలా టీపీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలంతా ఎవరికివారే అధిష్టానం పెద్దలను కలుస్తూ.. తమ పేర్లను పరిశీలించమంటూ కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్‌కుమార్‌గౌడ్ తాజాగా ఖర్గేను ..అంతకుముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిసినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY