ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవం, తుదిదశ పనులు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Minister Vemula Prashanth Reddy Inspects Final Stage Construction Works of Telangana Secretariat Building,Minister Vemula Prashanth Reddy,CM KCR will Inaugurate,Telangana State Secretariat Building,Telangana State Secretariat Building on February 17,Mango News,Mango News Telugu,Telangana Secretariat Address,Telangana New Secretariat Name,Telangana New Secretariat Design,Telangana New Secretariat Opening Date,Telangana New Secretariat Budget,Telangana New Secretariat Construction Company,Telangana Secretariat Cost,Telangana New Secretariat Architect,Telangana Secretariat Employees List,Telangana New Secretariat Location,Telangana New Secretariat Construction,Telangana New Secretariat Address,Telangana New Secretariat Cost,Telangana New Secretariat Building Location,Telangana New Secretariat Tender

డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని 2023, ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జరపాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సచివాలయ నిర్మాణ తుది దశ పనులను సోమవారం నాడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరిగి అక్కడే అధికారులు, వర్క్స్ ఏజన్సీతో సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం, పోర్టికో, అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం, గ్రౌండ్ ఫ్లోర్ నుండి సీఎం బ్లాక్ అయిన 6వ ఫ్లోర్ వరకు గల కారిడార్లు, మంత్రుల చాంబర్స్, వర్క్ స్టేషన్ లకు సంబందించిన అన్ని రకాల పనులపై బ్లాకుల వారిగా క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించారు.

అలాగే గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, లిఫ్ట్ ల పనులు, కోర్ట్ యార్డ్ ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్, రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్, ఫ్లోర్ వారీగా ఎలక్ట్రికల్ వర్క్ మరియు క్షేత్ర స్థాయిలో ఇతర సంబంధిత పనుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా.బీ.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం చేసుకోవాలని నిర్ణయించామని, నిర్మాణ తుదిదశ పనులు శరవేగంగా పూర్తి కావాలని ఈ సందర్బంగా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. సరిపడా మ్యాన్ పవర్ పెంచి 10 రోజుల్లో బ్లాకుల వారిగా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు, వర్క్ ఏజెన్సీకి స్పష్టం చేశారు. అదేవిధముగా నిర్మాణ పనులపై సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఈఏన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈ సత్యనారాయణ, ఈ.ఈ శశిధర్, శ్రీనివాస్, పలువురు ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్ పల్లోంజి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here