అభ్యర్థులకు గుడ్ న్యూస్ వినిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Postponement Of Group 2 Exam In Telangana,Postponement Of Group 2 Exam, Group 2 Exam Postponement,Group 2 Exam In Telangana, Group 2 Exam,Telangana, Cm Revanth Reddy, Dsc Exams, Group-2, Group-2 Postponed,Revanth Reddy, Telangana Congress,Telangana,Telangana Politics,Telangana Live Updates,Telangana,Mango News, Mango News Telugu
Group-2 Postponed,Postponement of Group 2 exam in Telangana?,CM Revanth Reddy,Group 2, DSC Exams

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొద్ది గంటల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. షెడ్యూల్ ప్రకారం జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించింది. దీనిపై టీజీపీఎస్సీ ఉత్తర్వులు  జారీ చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు  కూడా సిద్ధమవుతున్నారు.

కాకపోతే గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షల కోసం వెంటవెంటనే సన్నద్ధం కావడానికి సమయం సరిపోదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు .దీంతో తాజాగా నిరుద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని కోరడంతో పాటు..పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతోంది. గ్రూప్ 2 పోస్టులను 2వేలకు, గ్రూప్ 3 పోస్టులను 3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపికై 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు.

దీనిపై శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అత్యవసర సమావేశం నిర్వహించారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆ  తర్వాత ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలుకు షెడ్యూల్ ఉండగా.. ఈ రెండింటినీ బ్యాక్ టూ బ్యాక్ నిర్వహించడాన్ని అభ్యర్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయంపై  సీఎం దృష్టి సారించారు. వీటిపై అధికారులతో చర్చించిన రేవంత్ రెడ్డి.. పరీక్ష తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ఈ రోజే సీఎం వీరికి అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడుతుందా? లేక డీఎస్సీ వాయిదా పడుతుందా అనే ప్రశ్నలపై కాసేపట్లో టెన్షన్‌ వీడనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF