రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొలేకే ఎమ్మెల్సీ క‌విత‌పై కేసులు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud Slams Union Minister Kishan Reddy Remarks on MLC Kavitha in Delhi Liquor Scam Case,Minister Srinivas Goud Slams Union Minister Kishan Reddy,Minister Kishan Reddy Remarks on MLC Kavitha,Kishan Reddy Remarks on Kavitha in Delhi Liquor Scam,Mango News,Mango News Telugu,Minister Srinivas Goud Solid Replys,Will Ed Arrest MLC Kavitha,Delhi Liquor Policy Case,Kavitha appears before ED,ED Interrogation In Delhi Liquor Scam,MLC K Kavitha ED Interrogation,BRS MLC Kavitha For ED Enquiry Again,Minister Srinivas Goud Latest News,Minister Kishan Reddy News Today

కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొలేకే ఆయన కుమార్తె ఎమ్మెల్సీ క‌విత‌పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక త‌ప్పుడు కేసులతో భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నార‌ని, అక్రమ కేసులతో బీఆర్ఎస్ నేత‌ల‌ గొంతు నొక్కాల‌ని చూస్తే జ‌రిగే ప‌ని కాదని, కేసులకు భ‌య‌ప‌డేది లేదని, ఇది ఉద్య‌మాల గ‌డ్డ తెలంగాణ‌ అని గురుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ క‌విత సెల్‌ఫోన్లు ధ్వంసం చేశార‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఎలా చెబుతారు? ఏ ఆధారాల‌తో ఆయన ఆరోపణలు చేశారు? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్ర‌శ్నించారు. ఆయన ధ్వసం చేశారని ఆరోపించిన ఫోన్లు అన్నింటిని ఎమ్మెల్సీ క‌విత‌ ఈరోజు దేశరాజధానిలో మీడియా ఎదుట చూపించారని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు క‌విత‌కు కిష‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశ సంప‌ద‌ను దోచుకుని పారిపోయిన వారిని వదిలేసి ఒక మ‌హిళపై ప్రతాపం చూపిస్తున్నారని, గంటల తరబడి విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు కొల్లగొట్టిన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటివారు దేశం వెలుపల విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, నిజాయితీగా రాజకీయాలు చేసే బీఆర్ఎస్ నేతలను, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డను మాత్రం కేసుల పేరుతో జైలుకు పంపించడానికి చూస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను బీజేపీ పెద్దలు అంబానీ, అదానీ వంటివారికి పంచిపెడుతున్నారని, ఇదేంటని ప్రశ్నించినందుకే సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారని విమర్శించారు. ఒక మ‌హిళ గోప్య‌త‌, ప్ర‌తిష్ఠ దెబ్బ‌తినేలా బీజేపీ నేత‌లు వ్యవహరిస్తున్నారని, కొన్ని మీడియా సంస్థ‌లు కూడా అసత్య వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలలో అపోహలు కలిగిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here