రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ప్రయత్నించేవారు మాత్రమే వైఎస్ఆర్ కు నిజమైన వారసులు అని.. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారని… ఆయనను ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ అప్పట్లోనే చెప్పారని.. అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రధాని కావడం నేటి చారిత్రక అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్‌సభలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజల తరఫున మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. గాంధీభవన్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇకమన దేశంలో సంక్షేమానికి మారుపేరుగా వైఎస్సార్ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుంది. వైఎస్సార్ ముద్ర పేద ప్రజల గుండెల్లో బలంగా పాతుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు వైఎస్సారే స్ఫూర్తి. దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ చెబుతుండేవారు. కాలం కాటువేసిందో.. దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ గాంధీ ప్రధాని కాకముందే వైఎస్ మనల్ని విడిచి వెళ్లిపోయారన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్ చేసిన పాదయాత్రే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాహుల్‌గాంధీ పాదయాత్రే కారణం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కృషి చేసేవారే నిజమైన వైఎస్ వారసులు. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లే వారంతా వైఎస్ వారసులు కాదు అని తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
అలాగే సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున తాను తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టానని.. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ వారసులు అందరూ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ కోసం అంకితభావంతో పనిచేస్తున్న 35 మందికి కార్పొరేషన్ పదవులను ఇచ్చామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని స్పష్టం సీఎం రేవంత్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE