‘డ్రైవ‌ర్‌ లెస్ ట్రాక్ట‌ర్‌’ను డెవ‌ల‌ప్ చేసిన వ‌రంగ‌ల్‌ కిట్స్ కాలేజీ.. ఎంతో ఇంప్రెస్ అయ్యానంటూ, మంత్రి కేటీఆర్ ట్వీట్‌

Minister KTR Greets on The Driverless Autonomous Tractor Developed By Warangal KITS College,KTR Greets on The Driverless Autonomous Tractor,Driverless Autonomous Tractor Developed By Warangal KITS,Minister KTR Greets Warangal KITS College,Mango News,Mango News Telugu,KITS Professor Unveiled Driverless Automated Tractor,KITS Warangal invents driverless automated tractor,Minister KTR Latest News,Minister KTR Latest Updates,KTR Praises driverless tractor,Warangal KITS College News Today,Warangal KITS College Latest News,Warangal KITS College Latest Updates,Driverless Autonomous Tractor Latest News

తెలంగాణలోని వ‌రంగ‌ల్‌కు చెందిన కాక‌తీయ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సైన్సెస్‌ (కేఐటీఎస్‌-కిట్స్) ఇటీవ‌ల డ్రైవ‌ర్‌లెస్ ఆటోన‌మ‌స్ ట్రాక్ట‌ర్‌ను డెవ‌ల‌ప్ చేసింది. డ్రైవ‌ర్ లేకుండానే ఆ ట్రాక్ట‌ర్ భూమిని దున్నేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆ ట్రాక్ట‌ర్‌ను డెవ‌ల‌ప్ చేసిన తీరు త‌న‌ను ఎంతో ఇంప్రెస్ చేసిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వ్య‌వ‌సాయం ఈ విధంగానే ఉంటుంద‌ని, స‌మాజంపై ప్ర‌భావం చూపే వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లు, ఐడియాలు, ఉత్ప‌త్తుల‌తో యువ‌త ముందుకు రావాల‌ని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీ-హబ్‌, వీ-హ‌బ్, టీ-వ‌ర్క్స్‌, వంటి ప్రతిష్టాత్మక సంస్థ‌లు వారికి స‌హ‌క‌రించేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 19 =