తెలంగాణ అసెంబ్లీ ఆరో రోజు సమావేశాల్లో భాగంగా టీఎస్ బీపాస్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ సభలో ప్రవేశపెట్టి, బిల్లుపై పూర్తి వివరణ ఇచ్చారు. మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, దేశంలో శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 42 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో పెద్దస్థాయిలో మౌలిక వసతులు కల్పన శ్రీకారం చుట్టామన్నారు. నగరాలు, పట్టణాలలో భవనాల అనుమతులలో 100 శాతం పారదర్శకత కోసం సీఎం కేసీఆర్ సూచనల మేరకు టిఎస్ బీపాస్ చట్టాన్ని తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా రూపొందించిన ఈ చట్టం హైదరాబాద్ తో పాటుగా అన్ని మున్సిపాలిటీలకు వర్తిస్తుందని చెప్పారు.
టిఎస్ బీపాస్ లోని ముఖ్యాంశాలు:
- 75 గజాల లోపు స్థలం ఉండి, 7 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవనాలకు అనుమతి అవసరం లేదు.
- 75 నుంచి 600 గజాల వరకు స్థలం ఉండి, 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవనాలకు తక్షణమే అనుమతి పొందవచ్చు.
- 600 గజాలకు పైగా స్థలంలో, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు 21 రోజుల్లోనే సింగిల్ విండో అనుమతి పొందవచ్చు.
- స్వీయ ధృవీకరణ ఆధారంగా ఆమోదాలు, పౌరుల బాధ్యత వహించాలి మరియు అనుమతుల్లో మానవ ప్రమేయం ఉండదు.
- అర్బన్ లోకల్ బాడీ/మున్సిపాలిటీలు 21 రోజుల్లో పర్మిషన్ ఇవ్వకపోతే 22వ రోజున డీమ్డ్ అఫ్రూవల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తికీ ఆన్‌లైన్‌లో అనుమతి లభిస్తుంది.
- మొదటిసారిగా పూర్తిస్థాయి ఆటోమేటెడ్ స్వీయ ధృవీకరణ వ్యవస్థ ఏర్పాటు.
- 21 రోజుల్లోనే అనుమతులు.
- సింగిల్ రూఫ్ కింద లైన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసిలు జారీ.
- పర్యవేక్షణ కోసం కలెక్టర్ అధ్యక్షతన డిస్టిక్ట్ లెవల్ టిఎస్ బీపాస్ కమిటీ ఏర్పాటు.
- రాష్ట్ర స్థాయి చేజింగ్ సెల్ కూడా ఏర్పాటు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu