దేశంలో 48 లక్షలు దాటినా కరోనా కేసులు, 79 వేలకు పైగా మరణాలు

India Corona Updates, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, India Corona Updates, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 92071 పాజిటివ్ కేసులు నమోదవగా, 1136 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 14, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 48,46,427 కు, మరణాల సంఖ్య 79722 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 77512 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 37,80,107 కు చేరుకుంది.

దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 78 శాతం గానూ, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 9,86,598 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =