నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ నిరసన

Telangana Bandh Today,Telangana Bandh, Congress, justice for the unemployed, Revanth Reddy, Telangana bandh today, Telangana CM Revanth Reddy,Telangana Highcourt, Assembly Elections, Lok Sabha Elections,Telangana politics,telangana live updates,Harish Rao,KCR,Telangana,Mango News, Mango News Telugu
Telangana bandh today,justice for the unemployed,Revanth Reddy, Telangana CM Revanth Reddy, Congress

నేడు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ పిలుపునిచ్చారు . తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసనలు తెలపడంలో భాగంగా..ఈరోజు  తెలంగాణ బంద్‌కు ఆయన పిలుపు నిచ్చారు.ఈ బంద్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున  పాల్గొంటున్నారు.

ఇక అటు డీఎస్సీ వాయిదా వేయాలంటూ గాంధీ హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగిన  నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు . ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని ఓయూలో నిరుద్యోగులు కూడా నిరసనకు దిగారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని… గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో వేలు ఉద్యోగాలను కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

వీటన్నిటితో పాటు తెలంగాణ సర్కార్ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.  25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతున్న నిరుద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయాలని విద్యార్ధులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ హామీల సాధన కోసం నేడు జరుగుతున్న  తెలంగాణ బంద్ ప్రస్తుతం ప్రశాంతంగానే జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY