తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించి ఎనిమిది నెలలు పూర్తయింది. మొదటి నుంచి కూడా పాలనలో తన మార్క్ చూపిస్తూ రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ రెడ్డి.. మిగిలిన హామీలను కూడా వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా.. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడలు తీసుకొచ్చేందుకు ఈ ఏడాది జనవరిలో రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ వంటి దేశాల్లో పర్యటించారు. దిగ్గజ కంపెనీల అధినేతలతో మాట్లాడి వారిని రాష్ట్రానికి ఆహ్వానించారు.
అయితే మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా త్వరలోనే రేవంత్ రెడ్డి బృందం విదేశాలకు వెళ్లనుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారు అయింది. ఆగష్టు 3న రేవంత్ రెడ్డి బృందం అమెరికాకు వెళ్లనుంది. ఎనిమిది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగి ఆగష్టు 11న రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్‌కు చేరుకోనుంది. అమెరికాలోని డల్లాస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. అమెరికాలోని దిగ్గజ కంపెనీల అధినేతలు, సీఈవోలతో రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు.. ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలను వారికి వివరించి పెట్టుబడులను ఆకర్షించనున్నారు.
ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అమెజాన్, గూగుల్‌తో పాటు మరిన్ని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు మరిన్ని కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి బృందం అమెరికా వెళ్తంది. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించి పలు కంపెనీల అధినేతలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ