అవసరమైతే అసెంబ్లీ రద్దు చేస్తానన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Telangana BJP MLA Etela Rajender Responds Over CM KCR Comments of Early Elections, BJP MLA Etela Rajender Responds Over CM KCR Comments of Early Elections, MLA Etela Rajender Responds Over CM KCR Comments of Early Elections, Etela Rajender Responds Over CM KCR Comments of Early Elections, Telangana BJP MLA Responds Over CM KCR Comments of Early Elections, CM KCR Comments of Early Elections, Telangana CM KCR Comments of Early Elections, Early Elections in Telangana, Telangana Early Elections, CM KCR Challenges BJP, Telangana BJP MLA Etela Rajender, BJP MLA Etela Rajender, Early Elections in Telangana News, Early Elections in Telangana Latest News, Early Elections in Telangana Latest Updates, Early Elections in Telangana Live Updates, Telangana CM KCR Challenges BJP, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అవసరమైతే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి నిజంగా ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు.

గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా ఈటల స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మీద పోటీకి సిద్ధమని మరోసారి ప్రకటించారు. నేను నా సవాల్‌కు కట్టుబడి ఉన్నా.. కేసీఆర్‌పై తప్పకుండా గజ్వేల్‌లో పోటీ చేస్తా అని ఆయన తేల్చి చెప్పారు. బిజెపి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని, గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు మేము సిద్దంగా ఉన్నామని తెలిపిన ఈటల, బీజేపీ కీలక నేత అమిత్ షా కూడా కేసీఆర్‌ అసెంబ్లీ ని రద్దు చేస్తే.. సిద్దంగా ఉన్నామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + seventeen =