ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్

Telangana CM KCR AP CM YS Jagan Condoles the Death of Senior Actor Kaikala Satyanarayana,KCR Condoles To Kaikala Satyanarayana,YS Jagan Condoles To Kaikala Satyanarayana,Mango News,Mango News Telugu,Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana Death,Kaikala Satyanarayana Health,Kaikala Satyanarayana Wife,Kaikala Satyanarayana Wikipedia,Kaikala Satyanarayana Cast Name,Kaikala Satyanarayana Son,Kaikala Satyanarayana Is Alive,Telugu Actor Kaikala Satyanarayana,Kaikala Satyanarayana Actor,Kaikala Satyanarayana Kgf,Actor Kaikala Satyanarayana,Actor Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana And Kgf

ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, కైకాల సత్యనారాయణ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

అలాగే కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ, “గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seven =