ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Independence Day 2020, Independence Day Celebrations, Independence Day Celebrations 2020, Independence Day News, Pragathi Bhavan, Telangana CM KCR, Telangana CM KCR Hoists National Flag, Telangana CM KCR Hoists National Flag at Pragathi Bhavan

తెలంగాణలో రాష్ట్రంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద నివాళర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎంపీ కె కేశవరావు ఇతరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu