“ప్రాణం పంచే మనసున్న పోలీస్” అనే పాట ఆవిష్కరించిన డీజీపీ మహేందర్ రెడ్డి

DGP Mahender Reddy Unveiled the Pranam Panche Manasunna Police Song, Mahender Reddy, Pranam Panche Manasunna Police Song, Telangana DGP, Telangana DGP lauds MM Keeravani & Anantha Sriram, Telangana DGP Mahender Reddy, Telangana DGP unveils song on Police, Telangana police, Telangana police song

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరచి, ఆలపించిన “పోలీస్, పోలీస్…తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్” అనే పాటను తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి శనివారం నాడు ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి హాజరయ్యారు. సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈనెల 21 వతేదీ నుండి నేడు 31 వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్బోచితంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

విధినిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కస్టాలు,ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. మనం కష్టపడుతూ సేవలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని డీజీపీ అన్నారు. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయస్సులో తోలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని తెలియయజేశారు. ఇస్తున్నా ప్రాణం మీ కోసం అనే పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వర పరచి పాడానని గుర్తు చేశారు. ఈ పాటను హిందీ భాషలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ సందర్బంగా ఈ పాట చాలా శ్రావ్యంగానూ, స్ఫూర్తి దాయకంగా ఉందని పోలీసు అధికారులు ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu