తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2026’ విజేతల జాబితా విడుదలైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్, గత పదేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ పురస్కారాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
కళాకారులను గౌరవించడమే లక్ష్యంగా ద్వితీయ విడతగా ప్రకటించిన ఈ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ దక్కడం విశేషం. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఎంపిక చేసిన ఈ విజేతలకు, మార్చి 29న ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా పురస్కారాలను అందజేయనున్నారు.
తెలంగాణ సినీ కళాకారుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, కమల్ హాసన్, జయసుధ వంటి దిగ్గజాలకు అవార్డులు ప్రకటించడం ద్వారా ఈ పురస్కారాల స్థాయి పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దాదాపు దశాబ్ద కాలం తర్వాత గతేడాది ఈ పురస్కారాలను అందించిన రేవంత్ రెడ్డి సర్కార్ మల్లి వరుసగా ఈ ఏడాది కూడా ప్రకటించారు. ఈ మేరకు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మరియు స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ఈ అవార్డులను నేడు ప్రకటించారు. ఈ వేడుకను కేవలం ఒక అవార్డుల ప్రధానోత్సవంగా కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని చాటేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 – విజేతల పూర్తి జాబితా:
ప్రధాన జీవన సాఫల్య పురస్కారాలు:
-
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు: మెగాస్టార్ చిరంజీవి
-
పైడి జయరాజ్ అవార్డు: కమల్ హాసన్
-
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు: అశ్వనీదత్
-
బీఎన్ రెడ్డి అవార్డు: సింగీతం శ్రీనివాసరావు
-
అక్కినేని స్పెషల్ అవార్డు (ఫీమేల్): జయసుధ
-
రఘుపతి వెంకయ్య అవార్డు: రమేశ్ ప్రసాద్
-
సినారె అవార్డు: సుద్దాల అశోక్ తేజ
-
కాంతారావు అవార్డు: ఆర్.నారాయణమూర్తి
సినిమా విభాగాలు:
-
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
-
ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
-
ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
-
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
-
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
-
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు
-
ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా
-
ఉత్తమ బాలల చిత్రం: అనగనగా
-
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్: లిటిల్ హార్ట్స్
-
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్
నటీనటులు & సాంకేతిక నిపుణులు:
-
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
-
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
-
ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
-
ఉత్తమ సహాయ నటుడు: శివాజీ
-
ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా)
-
ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
-
ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
-
ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)
-
ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రీస్)
-
ఉత్తమ బాలనటుడు: రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
-
ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
-
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: అనిల్ రావిపూడి
-
ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర)
-
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
-
ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
-
ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
-
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (ఛాంపియన్)
-
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: గోవింద్ (అఖండ)
-
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు:
-
స్పెషల్ జ్యూరీ ఫిల్మ్: 23
-
స్పెషల్ జ్యూరీ హీరో: రోషన్ (ఛాంపియన్)
-
ఉత్తమ మేల్ యాక్టర్: చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
-
ఉత్తమ నటి (స్పెషల్): అనంతిక (8 వసంతాలు)
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాకారులను గౌరవించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళలకు ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది. ఈ అవార్డుల ప్రకటన టాలీవుడ్ భవిష్యత్తుకు శుభసూచకమని పండితులు అభిప్రాయపడుతున్నారు.





































