మైనార్టీ కోటాలో మంత్రి ఆయనేనా?

Minority quota, telangana cabinet, Revanth reddy, Telangana, G Kishan Reddy, CM Revanth Reddy, Muslim reservations, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Mango News Telugu, Mango News
minority quota, telangana cabinet, Revanth reddy, Telangana

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నేటితో సరిగ్గా రెండు నెలలు. డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజున 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ కేబినెట్‌లో మొత్తం 17 మందికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 11 స్థానాలు భర్తీ అయ్యాయి. మిగిలిన 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే ఆ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారిలో ఇద్దరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఏడుగురు ఓసీ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. మైనార్టీలు ఎవరూ లేరు.

దీంతో మైనార్టీ కోటాను కూడా భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా మాజీ మంత్రి షబ్బీర్ ఆలీకి ఎమ్మెల్సీ పదవికి కట్టబెట్టి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమిపాలయయ్యారు. 14 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే షబ్బీర్ ఆలీ.. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కష్టకాలంలో రేవంత్‌కు అండగా నిలబడ్డారు.

ఈక్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని.. ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని గుసగుసలు వినిపించాయి. ఇదే విషయంపై రేవంత్ రెడ్డి హైకమాండ్‌తో కూడా చర్చలు జరిపారు. కానీ హైకమాండ్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఇక ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో.. షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత మైనార్టీ కోటాలో మరికొందరి పేర్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.

అయితే రేవంత్ రెడ్డి పరిశీలించిన వారిలో వరంగల్‌కు చెందిన డాక్టర్ రియాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. పదేళ్లుగా రియాజ్ కాంగ్రెస్‌లో ఉంటూ.. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల తరుపున పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అప్పట్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. అందుకే రియాజ్‌ను ఎమ్మెల్సీ చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. మరి హైకమాండ్ ఏమంటుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =