సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన భారతీయ ఉమ్రా యాత్రికుల (వీరిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారు) కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు పరిహారం ప్రకటించింది.
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
తెలంగాణ మంత్రివర్గం ఈ ఘోర ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు కింది నిర్ణయాలు తీసుకుంది.
-
పరిహారం: ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రతీ ఒక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించారు.
-
ప్రతినిధి బృందం: మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు, మంత్రి అజారుద్దీన్‌తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే మరియు మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది.
-
అంత్యక్రియలు: చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
-
కుటుంబ సభ్యుల ప్రయాణం: బాధిత కుటుంబ సభ్యులను, ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున, సౌదీకి తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
కాగా, ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోనే ఏకంగా 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.




































