బొగ్గుగనుల వేలాన్ని నిలిపేవరకూ గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది – ఎమ్మెల్సీ కవిత

BJP Govt Conspiring to Weaken the Singareni Organization, Central BJP Govt Conspiring to Weaken the Singareni Organization, Central BJP Govt Conspiring to Weaken the Singareni Organization MLC Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha Comments On BJP, Kalvakuntla Kavitha Latest News, Kalvakuntla Kavitha News, Mango News, Mango News Telugu, MLC Kalvakuntla Kavitha, SCCL, sccl latest news, SCCL News, Singareni Organization, The Singareni Collieries Company Limited

తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్ చేశారు. “కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ మణిమాణిక్యం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. సింగరేణిలో రాష్ట్రానికి 51%,కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోంది” అని అన్నారు.

“సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో, దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించింది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోంది. ఇది సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్దం. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ, కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది” అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =