తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులతో ఉన్న సంబంధాలు మరియు ఎన్నికల సమయంలో జరిగిన నిఘాపై అధికారులు హరీశ్‌రావును ప్రశ్నించారు.
సిట్ ప్రశ్నల వర్షం:
-
సుదీర్ఘ విచారణ: మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి వరకు సుమారు ఏడున్నర గంటల పాటు కొనసాగింది.
-
సిట్ ప్రశ్నలు: “2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీతో పాటు మరో సీనియర్ నేత ఫోన్‌పై ఏడాది పాటు నిఘా ఉంచిన విషయం మీకు తెలుసా?” అని అధికారులు అడగగా.. “నేను నమ్మను” అని హరీశ్‌రావు సమాధానమిచ్చారు.
-
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ నేత రఘునందన్‌రావు కదలికలపై నిఘా ఉంచారనే ఫిర్యాదులపై కూడా ఆయనను ప్రశ్నించారు.
-
నిఘా విభాగం పరికరాల కొనుగోలుకు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో భారీగా నిధులు కేటాయించడంపై కూడా వివరణ కోరారు.
-
-
హరీష్ రావు సమాధానాలు: చాలా ప్రశ్నలకు ఆయన “తెలియదు.. గుర్తులేదు.. నమ్మను” అని బదులిచ్చినట్లు సమాచారం. తనపై తప్పుడు కేసు ఇరికించే ప్రయత్నం చేయవద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్తానని ఆయన అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.
-
మరోసారి విచారణ: హరీశ్‌రావు తన కుమారుడి ప్రయాణం ఉన్నందున విచారణ ముగించాలని కోరడంతో అధికారులు అనుమతించారు. అయితే, ఆయన సమాధానాలపై సంతృప్తి చెందని సిట్, మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
-
సాక్షుల ప్రభావం: విచారణ ముగిసిన తర్వాత ఈ కేసుతో సంబంధమున్న సాక్షులను సంప్రదించవద్దని అధికారులు ఆయనను ఆదేశించారు.
రాజకీయ స్పందన:
విచారణ అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. : “ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హరీశ్‌రావును పరామర్శించి, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య” అని మండిపడ్డారు.
మరికొందరు రాజకీయ ప్రముఖులకు కూడా త్వరలో నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుఫాను సృష్టిస్తోంది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల స్టేట్‌మెంట్ల ఆధారంగా హరీష్ రావు వంటి కీలక నేతలను విచారిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరికొందరు రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేడెక్కుతోంది. హరీష్ రావు సమాధానాల ఆధారంగా సిట్ తదుపరి చర్యలు తీసుకోనుంది.








































