తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే విదేశీ టూర్ ఖరారయింది. నేటి నుంచి పన్నెండు రోజుల పాటు రేవంత్ రెడ్డి.. అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయబోతున్నారు. ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ కొనసాగనున్న ఈ పర్యటనలో.. సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉండనున్నారు.
ఇక ఆగస్టు 5 వ తేదీన మరో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. ఈ రోజు నుంచి 9 వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ , శాన్ ప్రాన్సిస్కో, నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. అమెరికాలో కొంతమంది వ్యాపార వేత్తలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం ఈ రోజు నేరుగా న్యూయార్క్ వెళ్లనుంది.ఆగస్ట్ 4వ తేదీన న్యూజెర్సీలో కార్యక్రమం జరగనుండగా.. 5 వ తేదీన న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు.
ఆగస్ట్ 6 వ తేదీన పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటి సంస్థలతో సీఎం టీమ్ భేటీ కాబోతోంది. ఆగస్ట్ 7న చార్లెస్ స్కాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించబోతున్నారు. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్ జెన్ సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ కాబోతున్నారు. ఆగస్ట్ 9న గూగుల్ సినియర్ ప్రతినిధులతో సమావేశం జరగనుంది.
ఆగస్ట్ 10న అమెరికా నుంచి బయలుదేరి ఆగస్ట్ 11న దక్షిణ కొరియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ వెళ్లనున్నారు. ఆగస్ట్ 12న సియోల్‌లో యూయూ పార్మ, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్ట్స్‌టైల్ ఇండ్రస్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆగస్ట్ 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్‌తో భేటీ కాబోతున్నారు. ఆగస్ట్ 14న హైదరాబాద్‌కు సీఎం టీమ్ తిరుగు ప్రయాణం కానున్నారు.
ఆరు నెలల క్రితం విదేశాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. నలబై వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు.అయితే ఈసారి యాబై వేల కోట్లు టార్గెట్‌గా సీఎం ఫారెన్ టూర్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా పన్నెండు రోజుల రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో రేవంత్ టీమ్ పర్యటించనున్నారు. అమెరికాలో ఆరు రోజుల పర్యటన అనంతరం దక్షిణ కొరియాకు వెళ్తారు.
ఈ విదేశీ పర్యటనలో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ 52 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉండొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టిన కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో..ఆయా కంపెనీల అధిపతులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ సమావేశం కానున్నారు.