తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. నిజానికి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు… నిజంగా అభ్యంతరకరం. ఒక మహిళ మరొక మహిళ అయి, గౌరవవప్రదమైన వృత్తిలో ఉన్న కొండ సురేఖ మాట్లాడటం చివరకు ఆ పార్టీ వారితో పాటు, ఆమె అభిమానులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో ఇలాంటి అవమానాలు చాలానే జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత ఇన్సిడెంట్ తో టాలీవుడ్ ఏకమై… కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ఇటీవల డ్రగ్స్ గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..టాలీవుడ్ యాక్టర్లు అంతా తప్పనిసరిగా అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలంటూ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడటంపైన కూడా టాలీవుడ్ రగిలిపోతోంది.
అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులకు నంది అవార్డులు కాకుండా గద్దర్ అవార్డులు అని ప్రకటించడంపైన కూడా టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారట. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులకు ముఖ్యమంత్రి పేరు మార్చాల్సిన అవసరం ఏముందనని కొంత మంది వాదిస్తున్నారట.
అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వల్ల టాలీవుడ్ ప్రముఖులు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందరూ చర్చించుకుంటున్నారట. మొన్న అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఇన్ కన్వెన్షన్ కూల్చివేయడం, మురళీమోహన్ కు కూడా నోటీసులు పంపడం వంటి చర్యలకు దిగుతూ ఉండటంతో.. పెద్దలకు కోపం తెప్పించిందట.గతంలో కేసీఆర్ పాలనలో టాలీవుడ్ బాగుందని..కానీ ఇప్పుడు జగన్ కంటే దారుణంగా రేవంత్ రెడ్డి పాలన తయారైందని టాక్ నడుస్తోందట.
ఇక కొండ సురేఖ ఎపిసోడ్‌తో టాలీవుడ్ పెద్దలందరూ చంద్రబాబును కలవబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో చర్చించి హైదరాబాదు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి మెల్లగా షిఫ్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చాలామంది విశాఖపట్నంలో విల్లాలు, రిసార్టులు కొంటున్నారన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి కొండా సురేఖ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి షిప్ట్ అయ్యే పనిలో పడినట్లు తెలుస్తోంది. మరి దీనిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.