తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది?.. కొద్దిరోజులుగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణ, కొత్త టీపీసీసీ చీఫ్ పదవ గురించి హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ నియమనిబంధనల ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి టీపీసీసీ చీఫను మారుస్తుంటారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదా అప్పటి వరకు ఉన్నవారికే మరోసారి పదవిని ఇవ్వడం చేస్తుంటారు.
అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నందున ఆయన పీసీసీ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం రెండు పదవులు ఒక్కరికే ఇవ్వకూడదు. అందువల్ల ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ను నియమించాల్సి ఉంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి ఢిల్లీలో తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ నేతలు సమావేశం కానున్నారు. ఈసందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కోసం పలువురి పేర్లను హైకమాండ్‌క సూచించారట. వారిలో ఒకరికిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ హైకమాండ్ బీసీ లేదా ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను పీసీసీ చీఫ్‌గ ఎంపిక చేయాలని చూస్తోందట. ఈక్రమంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క, బలరాం నాయక్‌ల పేర్లను.. అలాగే బీసీ సామాజిక వర్గానికి చందిన మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్‌ల పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు సూచించారట. నలుగురి పేర్లను రేవంత్ హైకమాండ్‌కు సూచించినప్పటికీ సీతక్క వైపే మొగ్గు చూపుతున్నారట. సీతక్క గిరిజన మహిళ అయిందున ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ద్వారా.. సానుకూలత పెరిగే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా చెప్పారట. మరి హైకమాండ్ ఎవరికి పదవిని కట్టబెడుతుందో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE