ఇబ్ర‌హీంప‌ట్నం, ములుగులో గార్మెంట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఫ్యాక్ట‌రీలు ఏర్పాటుచేయనున్న ‘జాకీ’, ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

Minister KTR Announces Popular Garment Brand Jockey To be Setting up Manufacturing Factories in Ibrahimpatnam and Mulugu,Minister KTR,Popular Garment Brand Jockey,Jockey To be Setting up Manufacturing, Factories in Ibrahimpatnam,Jockey Factories In Mulugu,Mango News,Mango News Telugu,Jockey Manufacturing Unit,Jockey Manufacturing In Mulugu,Jockey Manufacturing In Ibrahimpatnam,Minister KTR Latest News And Updates,Telangana CM KCR

ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ ‘జాకీ’ (పేజ్ ఇండస్ట్రీస్) కంపెనీ తెలంగాణలో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం మరియు ములుగు నియోజకవర్గాల పరిధిలో నూతన గార్మెంట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఫ్యాక్ట‌రీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈరోజు ఉదయం జాకీ కంపెనీ ప్ర‌తినిధులు మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు కేటీఆర్‌కు వారు తెలిపారు. దీనిని మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఫ్యాక్ట‌రీల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,000 మందికి ఉపాధి కలుగనుందని, అలాగే ఈ ఫ్యాక్ట‌రీల నుంచి 1 కోటి వస్త్రాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ‘జాకీ’ పెట్టుకుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జాకీ కంపెనీని హృద‌య‌పూర్వ‌కంగా తెలంగాణకు స్వాగ‌తిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 7 =