పదేళ్లు విజయవంతంగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయాక.. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయి అధికారాన్ని కోల్పోయిన గులబీ పార్టీకి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతూ షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలయిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కారు దిగి అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికే చేరనున్నట్లు తెలంగాణ పొలిటికల్ స్ట్రీట్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిలో భాగంగానే, బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా గులాబీ పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గంగుల బీఆర్ఎస్ను రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే గంగుల కమలాకర్ 29 మంది కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి గులాబీ బాస్ కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్, కేటీఆర్‌తో పాటు గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై చర్చించిన కేసీఆర్.. గంగులతో పాటు ఇతర నేతలకు కూడా ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీని వీడొద్దని.. తెలంగాణలో భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని కేసీఆర్ ఆ నేతలకు భరోసా కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీ కష్టకాలంలో ఉన్న వారందరికీ భవిష్యత్తులో మంచిగా చూసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి వరుసగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడుతుండటంతో పాటు తాజాగా గంగుల కమలాకర్ కూడా కారు దిగిపోనున్నారని వార్తలు వినిపించడంతో అప్రమత్తమైన కేసీఆర్.. ఫామ్ హౌస్‌కు పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సమయంలో ..కరీంనగర్లో బలమైన నేత అయిన గంగుల ఇప్పుడు పార్టీ మారితే భవిష్యత్‌లో కరీంనగర్లో పార్టీకి కష్టాలు తప్పవనే ఆలోచనతోనే ఇప్పుడు గంగులను గులాబీ బాస్ కూల్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో గంగులతో భేటీ అవడంతో గంగుల పార్టీ మార్పు వార్తలకు చెక్ పడినట్లు అయినా..ఫ్యూచర్లో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY