మూసీ నది ప్రక్షాళన కేంద్రంగా తెలంగాణలో రాజకీయ విమర్శలు హీటెక్కుతున్నాయి. గురువారం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ వేశారు. ఎప్పటికీ మూసీ చుట్టూ ప్రజలు రోగాలతో బతకాలా అని ప్రశ్నిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్. అసలు మూసీ ప్రక్షాళల ఎలా చేస్తారు… అక్కడ నిర్వాసితులకు ఏం చేయబోతున్నారో వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.. కాగా సీఎం రేవంత్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.
ముందు మూసి నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం.. రేపు రమ్మంటావా.. ఎల్లుండి రమ్మంటావా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం. ముందు మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్‌అండ్‌ఆర్ కాలని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదాం’’ అని సవాల్ విసిరారు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు హరీష్. అవేమీ చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ యాక్టివిటీ నిర్మాణంతో మొదలు కాలేదని… విధ్వంసంతో మొదలైందని గుర్తు చేశారు.
పేదల ఇళ్ళను కూల్చటాన్ని మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని హరీష్ రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సీఎం మాట్లాడిన అబద్దాల మాటలతో అబద్ధం కూడా ఆశ్చర్యపోయిందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే సీఎం రేవంత్ మూసీ అంశాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చటంలో కాంగ్రెస్ చతికిలపడిందని విమర్శించారు. నదీ జలాల శుద్ధితో మూసీ నది పునర్జీవ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. మొదట మూసీ నదిలో వ్యర్థాలు వచ్చి చేరకుండా అడ్డుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. మూసీలో గోదావరి నీళ్ళను కలపటానికి డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు.
బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై స్పందించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మూసీ సుందరీకరణకు, పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముందు మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ వాటర్ అందులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా సుందరీకరణ చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ చారిత్రక వైభవానికి ఆనవాలుగా మిగిలిన మూసీకి పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా మూసీ సుందరీకరణ చేపట్టినట్లు చెప్పారు.