తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పార్థసారథి పదవీ బాధ్యతల స్వీకరణ

Retired IAS Parthasarathi Takes Charge as Telangana State Election Commissioner

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయం లో సాంప్రదాయ బద్దంగా పూజ నిర్వహించారు. అనంతరం తన చాంబర్ లో ఎన్నికల కమీషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా స్వామ్య పరిరక్షణలో ఎన్నికలు అత్యంత కీలకమని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ హోదాలో రాజ్యాంగం ప్రకారం గడువు లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే గురుతర రాజ్యాంగ బాధ్యతను నిర్వహించే అవకాశాన్ని తనకు కల్పించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అలాగే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీ, జిల్లాల ఎన్నికల యంత్రాంగం సహకారం, సమన్వయంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ ఎస్ఈసీ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి, రాష్ట్ర ఎన్నికల కమీషన్ గౌరవాన్ని మరింత పెంచడానికి తన వంతు కృషి చేస్తానని పార్ధసారధి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ రాజ్ లోకల్ బాడీ ఎలెక్షన్స్ అన్నీ పూర్తి అయ్యాయని, ప్రస్తుతం స్టేట్ ఎలెక్షన్ కమీషన్ ముందున్న పని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గడువు లోపు నిర్వహించాల్సి ఉన్న కొన్ని అర్బన్ లోకల్ బాడీ ఎలెక్షన్స్ ను పకడ్బందీగా, రాజ్యాంగ నిబంధనలను అనుసరించి నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

2021, ఫిబ్రవరి 10 తేదీతో పదవీ కాలం ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించటం తన ప్రథమ ప్రాధాన్యత అని, త్వరలోనే జీహెఛ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జీహెఛ్ఎంసీ ఎన్నికల అనంతరం మార్చి, 2021 తో పదవీ కాలం ముగియనున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కు, అలాగే ఏప్రిల్ లో పదవీ కాలం ముగియనున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ -19 దృష్ట్యా భారత ఎన్నికల సంఘం జారీ చేసిన భద్రతా చర్యలను రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు గాను అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. తదనంతరం, రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలి వున్న పంచాయతీ రాజ్, పట్టణ స్ధానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషనర్ పార్థసారథి అన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =