స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే ధ్యేయంగా జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు : వైఎస్ షర్మిల

Mango News, YS Sharmila, YS Sharmila held New Party Preparatory Meeting, YS Sharmila held New Party Preparatory Meeting at Lotus Pond, YS Sharmila held New Party Preparatory Meeting at Lotus Pond Today, YS Sharmila Meeting Updates, YS Sharmila Meeting Updates at Lotus Pond, YS Sharmila New Party, YS Sharmila New Party In Telangana, YS Sharmila New Party Preparatory Meeting, YS Sharmila New Party Preparatory Meeting News, YS Sharmila New Party Preparatory Meeting Updates

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బుధవారం నాడు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ సమావేశానికి ముఖ్య నాయకులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ‌లో రాజ‌న్న సంక్షేమ పాల‌నకు పున‌ర్జీవం పోసేందుకు సిద్ధ‌ప‌డ్డానని చెప్పారు. స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే ధ్యేయంగా తన ప‌య‌నం సాగుతుందని, ఇందుకోసం ప్రజలు స‌హాయ‌, స‌హ‌కారాలు కోరుతున్నానని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజైన జూలై 8న పార్టీ ఆవిర్భావించాల‌ని నిర్ణ‌యించామని చెప్పారు.

అన్ని వ‌ర్గాల‌ బాగు కోసం స్థాపించ‌బోయే ఈ పార్టీకి సంబంధించి జెండా, అజెండా రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని భావిస్తున్నట్టు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇందుకోసం ఒక ఈమెయిల్ ఐడీ, వాట్సాప్ నంబ‌ర్‌ను క్రియేట్ చేశారు. రాష్ట్రంలోని పేద‌లు, యువ‌త‌, విద్యావంతులు, మేధావులు, లాయ‌ర్లు, పారిశ్రామిక వేత్త‌లు, అనుభ‌వ‌జ్ఞులు, రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి అమూల్య‌మైన స‌ల‌హాలు అందించాల‌ని కోరారు. స‌ల‌హాలు, సూచ‌న‌లను [email protected] అనే ఈ మెయిల్ కు లేదా వాట్సాప్ నెంబర్ +91 8374167039 కు పంపించాలని వైఎస్ షర్మిల కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ