ఐటి రంగం అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలి, అధికారులకు సీఎస్ ఆదేశం

CS Somesh Kumar meeting with Officials on IT Grid Policy, GRID policy, GRID Policy for IT industry development, IT Grid Policy, IT industry, IT industry development, Mango News, Somesh Kumar, telangana, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Review Meeting, Telangana govt launches GRID Policy, Telangana govt launches GRID Policy for IT industry, Telangana launches GRID Policy

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో ఐటిరంగం అభివృద్ధి కోసం అవసరమైన బ్లూ ప్రింట్ ని తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటి శాఖా మంత్రి కె.టి.రామారావు చొరవతో ఈ ఐటి గ్రిడ్ పాలసిని గతంలో మంత్రివర్గం రూపొందించింది. ఈ ఐటి గ్రిడ్ పాలసీ వలన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వివిధ ఐటి సంస్థల పార్క్ ల ఏర్పాటుకు మరియు నగరంలో ఉన్నటువంటి ఐటి పార్క్ లు అవుటర్ రింగ్ రోడ్ కు తరలించడానికి ఈ పాలసీ సహకరిస్తుందని పేర్కొన్నారు.

సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఉప్పల్, నాగోల్, కాటేదాన్, కొంపల్లి, నగరంలోని ఇతర ప్రాంతాలలో ఐటి రంగం అభివృద్ధిపై పలు పారిశ్రామిక వేత్తలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఐటి అభివృద్ధికి అవసరమైన మౌలిక వనరుల కల్పనకు, మాస్టర్ ప్లాన్ రూపొందించుటకై ఈ నెల 27 లోపు సంబంధిత వర్గాల నుండి సలహాలు, సూచనలు సేకరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయాల మేరకు ఐటి అభివృద్ధికి, ఈ ప్రాంతాలలో ఐటి పరిశ్రమలను ప్రోత్సహించుటకు ప్రభుత్వ నిర్ణయించింది. తదనుగుణంగా ఐటి రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డి, సీఆర్‌వో అమర్ నాథ్ రెడ్డి, క్రెడాయ్, ట్రెడా ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − sixteen =