వచ్చే హుజూరాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు : వైఎస్ షర్మిల

Huzurabad, Huzurabad Byelection, Huzurabad bypoll, Huzurabad Bypoll News, Huzurabad Nominations, Mango News, YS Sharmila Latest News, YS Sharmila New Party News, YS Sharmila YSRTP, YS Sharmila YSRTP Decided to File Hundreds of Nominations in Huzurabad with Unemployees, YSRTP Decided to File Hundreds of Nominations, YSRTP Decided to File Hundreds of Nominations in Huzurabad, YSRTP Decided to File Hundreds of Nominations in Huzurabad with Unemployees

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది విద్యార్థులేనని వైఎస్ షర్మిల అన్నారు. 7 ఏండ్ల తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల నొటిఫికేషన్స్ కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరో ఉద్యమాన్ని మొదలుపెట్టిందని చెప్పారు. 7 వారాలుగా నిరుద్యోగ నిరాహార దీక్షలతో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డామని తెలిపారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే వచ్చే హుజూరాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందన్నారు. ఇక నుంచి తమ పార్టీ నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తుందని, పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ