బిగ్ బాస్ 8 గురువారం ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్‌కు బిగ్ బాస్ చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇచ్చాడు. మొన్న రేషన్ కోసం టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు మనీ కోసం కొన్ని టాస్క్ లు ఇచ్చాడు.ఈ టాస్క్ ల్లో గెలవడానికి హౌస్ మేట్స్ గట్టిగానే పోటీ పడ్డారు. హౌస్ లో ఉన్న మూడు టీమ్స్ కు ఆరు గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. లెక్కలేనంత డబ్బు గెలుచుకోవడానికి బిగ్‌బాస్ అవకాశాలు ఇస్తున్నాడని.. బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాన్నిసమయానుసారం ఉపయోగించుకొని… ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీమ్ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు.
మొదటి గేమ్ లో హౌస్ లో ఉన్న టీవీలో కొందరి పేర్లను బిగ్ బాస్ చూపించాడు. అందులో ఎవరి పేర్లు ఉన్నాయో వారు స్విమింగ్ పూల్ లో దూకాలి అలా దూకిన వారి టీమ్ విన్ అవుతుందని… ఆ టీమ్‌కు 25 వేలు ప్రైజ్ మనీ ఇస్తామని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు .టీవీలో సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పేర్లు ఇచ్చాడు బిగ్‌బాస్.
అయితే పేర్లు డిస్ ప్లే అవ్వగానే యష్మీ టీమ్ లో ఉన్న పృథ్వీ.. మణికంఠను గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. ఆతర్వాత సోనియా పరిగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో కిందపడిపోయింది. విష్ణుప్రియ వెళ్లి స్విమింగ్ పూల్ లో దూకడంతో విష్ణు ప్రియా విన్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఈసారి ఓ రోప్ ఇచ్చి తమకిచ్చిన బాల్స్‌ను ఒక బాస్కెట్‌లో వేయాలి. ఈ టాస్క్ కోసం పృథ్వీ, నబీల్, నిఖిల్ పేర్లను డిస్ ప్లే చేశారు. ఈ గేమ్ లో ఎక్కువ బాల్స్ ఎవరు వేస్తారో వారే విన్నర్ అని.. వారికి 50 వేల రూపాయిలని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు .
ఈ గేమ్ లో నబీల్ రోప్ జారిపోవడంతో అతను గేమ్ నుంచి తప్పుకోగా.. ఇక నిఖిల్, పృథ్వీ గట్టిగా పోటీ పడ్డారు. ఫైనల్ గా ఈ గేమ్ లో నిఖిల్ గెలిచాడు. ఇక మూడో టాస్క్ లో మణికంఠ, యష్మీ, నైనిక పేర్లు సెలక్ట్ చేసిన బిగ్ బాస్.. బిగ్ బాస్ చెప్పిన పదాలకు ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్స్ రాస్తారో వారే విన్నర్ అంటూ చెప్పాడు. ఈ గేమ్ కు 70 వేల రూపాయలని అనౌన్స్ చేశాడు. ఈ టాస్క్ లో మణికంఠ విన్ అయ్యాడు.
నాలుగో గేమ్ విలువ లక్ష 50 వేలు అని అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. ఓ గ్లాసులో ముగ్గురు కంటెస్టెంట్లు పల్పీ ఆరెంజ్ బాటిల్‌ను పోస్తారని ఇలా పోసేటప్పుడు ఎవరి గ్లాస్ నుంచి పల్పీ ఆరెంజ్ లీక్ అవుతుందో వాళ్లు అవుట్ అని చెప్పాడు. ఈ టాస్క్ కోసం నిఖిల్, అభయ్, ఆదిత్య ఓంను బిగ్ బాస్ సెలక్ట్ చేశాడు . ఈ టాస్క్ లో ముందుగా ఆదిత్య అవుట్ అవగా.. నిఖిల్ , అభయ్ ఇద్దరు గట్టిగా పోటీపడ్డారు. అయితే దీనిలో ఇద్దరికీ టై అవడంతో.. చెరో 75వేలు రూపాయలను బిగ్ బాస్ షేర్ చేశాడు.
ఆ తర్వాత టాస్క్ కు 50 వేలు వ్యాక్స్ టాస్క్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో నిఖిల్, నబీల్, పృథ్వీ పోటీపడగా నబీల్ విన్ అయ్యాడు. ఆ తర్వాత సాక్స్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్. ఒకొక్క టీమ్ నుంచి ఇద్దరు సభ్యులను సెలక్ట్ చేశాడు. కాలుకి వేసుకున్న సాక్స్‌ను ఎవరైతే చివరి వరకూ ఉంచుకుంటారో వాళ్లే విన్నర్. ఈ టాస్క్ లో నిఖిల్, అభయ్ గెలిచారు. దీంతో గేమ్స్ ముగిసే సమయానికి మొత్తంగా నిఖిల్ టీమ్ దగ్గర ఎక్కువగా లక్షల 45 వేల రూపాయలు ఉండగా.. యష్మీ టీమ్ దగ్గర లక్ష 25 వేలు రూపాయలు, నైనిక టీమ్ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి.