ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు మరో లెవెల్ లో ఉండబోతుందని బుధవారం ఎపిసోడ్ లో మీ అందరికీ అర్థం అయింది. అయిేత నిన్న చూసింది కేవలం టీజర్ మాత్రమే, ఈరోజు అసలు సిసలు టాస్క్ మొదలు అవ్వబోతుందని ప్రోమోలో తెలుస్తుంది..నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ టాస్క్ తో బిగ్ బాస్‌ని అవినాష్, రోహిణి అలరించడంతో బిగ్ బాస్ కిచెన్ సమయాన్ని రెండు గంటలు పొడిగిస్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ ఇస్తాడు. ఓజీ క్లాన్ ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ అవ్వగా, రాయల్ క్లాన్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్ గా ప్రకటిస్తాడు. ఓజీ క్లాన్ మొత్తం గార్డెన్ ప్రాంతం లో ఉండాలని, అలాగే రాయల్ క్లాన్ మొత్తం హౌస్ లోపల మాత్రమే ఉండాలని బిగ్ బాస్ చెబుతాడు. ఈ టాస్క్ నిన్న ఎపిసోడ్ చివరి 15 నిమిషాలు మాత్రమే జరిగింది.
అవినాష్ చాలా తెలివిగా నభీల్ వెనుక దొంగ చాటుగా వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్లి పోతాడు. ఇక నయనీ పావని అయితే యష్మీని కిందకి తోయడమే కాకుండా ఏకంగా ఆమె పైకి ఎక్కి ఛార్జింగ్ పెట్టుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్లో మణికంఠ వాష్ రూమ్ కి వెళ్లడంతో గొడవ మొదలు అవుతుంది.ఓజీ క్లాన్ మొత్తం వాష్ రూమ్ వైపు దూసుకుపోగా , రాయల్ క్లాన్ సభ్యులు వారిని అడ్డుకుంటారు. గౌతమ్ నిఖిల్, నభీల్ ని అడ్డుకోవడంతో.. నభీల్ గౌతమ్ తో నువ్వు నీ మోచేతితో గట్టిగా ముఖం మీద గుద్దావని అంటాడు. కానీ తాను అలా చేయలేదని గౌతమ్ గట్టిగా అరిచి చెప్తాడు. ఆ కోపంలో గౌతమ్ తాను గట్టిగా పట్టుకున్న నిఖిల్ ని పక్కకి విసిరి కొట్టడా నిఖిల్ కు దెబ్బలు తగులుతాయి.
దీంతో నిఖిల్.. గౌతమ్ ని కొట్టడానికి వెళుతుండగా..ప్రేరణ అతన్ని ఆపుతుంది. నభీల్ నువ్వు కావాలని ఫిజికల్ అయ్యావంటూ గౌతమ్ పై అరుస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ తాను కొట్టినట్టు ఉంటే, తన అమ్మ మీద ఒట్టు, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పోతానని అంటాడు. వెంటనే నిఖిల్ ‘పోపో’ అని అరుస్తాడు. మొత్తంగా ఈ టాస్క్ ఫుల్ ఫైర్ మీద నడిచింది. అందరికీ దాదాపు దెబ్బలు చాలా గట్టిగానే తగిలాయి. కానీ గౌతమ్‌తో నిఖిల్, నభీల్ పడిన గొడవలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పనేది ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది.