బిగ్ బాస్ 8వ సీజన్‌కు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. గ్రాండ్ ఫినాలేకు డేట్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ షో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేశారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 2 నుంచి బిగ్ బాస్ 8 సీజన్ టెలికాస్ట్‌లో మార్పు ఉండబోతుంది.
మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు.దీంతో ఎప్పటిలాగే గ్రాండ్ ఫినాలే నిర్వహించి.. బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించనున్నారు. పదమూడో వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అవడంతో.. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ జబర్దస్త్ అవినాష్, గౌతమ్ కృష్ణ, నిఖిల్ , నబీల్ , ప్రేరణ , విష్ణుప్రియ, రోహిణి ఉన్నారు.
అయితే, బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను డిసెంబర్ 15 నిర్వహించనున్నారు. దీంతో బిగ్ బాస్ 8వ సీజన్ 105 రోజులు ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అట్టహాసంగా జరగనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో.. ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో.. ఆ విన్నర్‌కు ఏ హీరో ట్రోఫీని అందిస్తారో అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గత సీజన్‌లో హోస్ట్‌గా చేసిన నాగార్జునే.. విజేత పల్లవి ప్రశాంత్‌కు టైటిల్ కప్ అందించాడు. ఈసారి స్పెషల్ గెస్ట్‌ను పిలుస్తారా లేదా నాగార్జునతోనే ఇప్పిస్తారా అన్న చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం చేసే సమయంలో కూడా మార్పులు చేశారు. స్టార్ మా టీవీ ఛానెల్‌లో ప్రతీ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యేది. కానీ, ఈ రోజు నుంచి ..గంట ఆలస్యంగా అంటే రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. స్టార్ మాలో కొన్ని సీరియల్స్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాయని అందుకే ఈ మార్పులు అన్న టాక్ నడుస్తోంది.దీనికి తోడు బిగ్ ఈ రెండు వారాలే బిగ్ బాస్ 8 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అని తేలనుంది. దీంతోనే స్టార్ మా ప్రేక్షకులను మరింతగా తమ ఛానెల్‌కు ఎంగేజ్ చేయడానికి ఈ లేటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.