గూగుల్ మ్యాప్స్ కంటే బెటరైన యాప్..

Better App Than Google Maps Heard Of The Maples App,Google Maps,Maples App,Google Maps and Maples App,Mango News,Mango News Telugu,Mappls App,maple map app,Mappls MapmyIndia,Mappls Super Map App for Maps,Mappls MapmyIndia Maps,MapmyIndia,Mappls MapmyIndia Maps Latest News, Mappls MapmyIndia Maps Updates,Mappls MapmyIndia Maps Latest News and Updates,Mappls MapmyIndia Maps Playstore,Mappls MapmyIndia Maps App Store

ఒకప్పుడు అవతలి వారి చిరునామా పక్కాగా తెలిస్తేనే అక్కడకు వెళ్లడానికి ప్లాన్ చేసుకునేవారు. కానీ రోజులు మారాయి, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ రోజురోజుకు అప్ డేట్ అవుతుంది. అందుకే చేతిలో మొబైల్ ఉంటే చాలు కావాల్సిన ప్రాంతాలకు వెళ్లిపోవొచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది. బ్యాటరీ ఫుల్,నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు గూగుల్ మ్యాప్స్‌తో ప్రపంచంలోని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చనే ధీమాను కూడా ఇచ్చింది.

అయితే ఒక్కోసారి ఆ గూగుల్ మ్యాప్స్ కొంపలు ముంచిన ఘటనలు కూడా జరిగాయి అది వేరే విషయం. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌ను తలదన్నేలా.. మ్యాపుల్స్ యాప్ ఒకటి కొత్తగా వచ్చేసింది. మ్యాపుల్స్ మ్యాప్.. మై ఇండియా అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ 28 ఏళ్లుగా మార్కెట్లో ఉంది. ఈ కంపెనీ ఇండియాలో చాలా వాహనాల్లో, వాహన తయారీ కంపెనీ అమర్చిన సిస్టమ్‌లో మ్యాప్‌ల సౌకర్యాన్ని అందిస్తుంది.

మ్యాపుల్స్ (Mappls) యాప్ గురించి గూగుల్ ప్లే నుంచి అయినా యాపిల్ స్టోర్ నుంచి మాప్లెస్ యాప్‌ను ఉచింతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం వెళ్లే రూట్లో ప్లై ఓవర్ వంటిది కనిపించినప్పుడు దానిమీదనుంచి వెళ్లాలా లేక కిందనుంచి వెళ్లాలా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. దీనిని ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ సరిగా చూపించదు. కాదు మ్యాపుల్స్ మాత్రం మనం వెళ్లే మొత్తం రూట్‌ను స్పెషల్ త్రీడీ వీక్షణలో చూపిస్తుంది. అంతేకాదు వాయిస్ కూడా వినిపిస్తుంది.

కొన్ని కొన్నిసార్లు మనం స్పీడుగా వెళ్లాలన్న తొందరలో .. చాలా వేగంగా వెళ్లిపోతాం. దీనివల్ల హై స్పీడ్ కెమెరాలు.. మన వెహికల్ వేగాన్ని గుర్తించి, మన మొబైల్‌కి చలానా రూపంలో బాదుడు వేసేస్తాయి. అయితే ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ..రోడ్డుపై ఉన్న అన్ని స్పీడ్ కెమెరాలతో పాటు..ఆ రోడ్డు వేగ పరిమితి వివరాల్ని కూడా మ్యాపుల్స్ మనకు ముందుగానే చెప్పి హెచ్చరిస్తుంది. దీంతో మనం కాస్త జాగ్రత్తగా వెళతాం.

అంతేకాదు చివరకు మ్యాపుల్స్ యాప్ మన ప్రయాణంలో మనకు కనిపించని గుంతల గురించి కూడా ముందగానే సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. దీనివల్ల మన ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుంది. గుంతల వల్ల వాహనానికి కలిగే నష్టాలను కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది. మెయిన్‌గా రాత్రివేళలో చేసే ప్రయాణాలలో రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

చివరకు మనం లాంగ్ జర్నీలకు ప్లాన్ చేసుకున్నప్పుడు టోల్ ట్యాక్స్ చెల్లించడానికి కూడా అంచనాకు మించి డబ్బు చాలా ఖర్చు అవుతుంది. అయితే మనం వెళ్లే రూటులో ఎక్కడెక్కడ టోల్‌లు వస్తాయో, ఏ టోల్‌లో ఎంత డబ్బు అడుగుతారో కూడా మ్యాప్యుల్స్‌లో ముందుగానే తెలుసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =