బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభం నుంచి అంతగా ఆకట్టుకోలేదన్న టాక్ తోనే నడుస్తుంది.మధ్యలో అప్ అండ్ డౌన్ గా టీఆర్పీ రేట్స్ సాగుతోంది. నామినేషన్స్‌లో మాత్రం టీఆర్పీ పెంచుకుంటున్న ఈ సీజన్‌లో కాస్త మసాలా యాడ్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కాస్త ఊరటనిచ్చాడు బిగ్ బాస్. అయితే కొత్త కంటెస్టెంట్లను తీసుకొచ్చినా, హుషారైన పాత కంటెస్టెంట్లను ప్రవేశపెట్టినా ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకోలేకపోతోంది.
సీజన్ 7 లాగే ఇదీ ఓవరాల్‌గా ఫ్లాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులో 8 మంది పాతవాళ్లు, మరో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన వాళ్లు ఉన్నారు. వీరి ఎంట్రీలకు సంబంధించిన దృశ్యాలను రీలోడ్ పేరుతో ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్‌గా నిర్వహించారు. ఆ ఎపిసోడ్ మూడున్నర గంటలు రన్ టైమ్ అయినా సరే రేటింగు పెద్దగా రాలేదు.
హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరులోపే రేటింగ్ రావడంతో బిగ్ బాస్ టీమ్ షాక్ అయిందట. శనివారం వీకెండ్ షో రేటింగ్స్ అయితే ఏకంగా ఐదు కంటే తక్కువకే పడిపోయాయట. మిగతా రోజుల్లో అయితే ఈ రేటింగ్స్ 3.5 నుంచి 4 వరకు పతనమయ్యాయి. బిగ్ బాస్ రియాలిటీ షో 21కు పైగా టీఆర్‌పీ రేటింగ్స్ కూడా రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ స్థాయి నుంచి 3.5 రేటింగ్స్‌ల స్థాయికి పడిపోవడం అంటే బిగ్ బాస్ క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పొచ్చు. బహుశా బిగ్‌బాస్ తెలుగు షో చరిత్రలోనే ఇంత తక్కువగా రేటింగ్స్ వచ్చిన సీజన్ ఇదే అంటున్నారు. సరైన కంటెస్టెంట్లు లేకపోవడం, ఏ క్రియేటివిటీ లేకుండా పాత గేమ్స్, అలాగే పాత టాస్కులు పెట్టడం వల్ల ఆడియన్స్ ను పెంచుకోలేకపోతున్నారు.
అయితే అవినాష్, రోహిణి మాత్రం గేమ్స్‌లో టఫ్ ఫైట్ ఇస్తూనే.. ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ అందిస్తున్నారు. హరితేజ ఎందుకో ఈసారి మ కావలసిన వినోదాన్ని అందించలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఈ షోకు గంగవ్వ ఫిట్ కాదని గత సీజన్లోనే తెలిసినా..మళ్లీ ఎందుకు తెచ్చారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈసారి సీజన్ ఆడియన్స్ ను అస్సలు మెప్పించలేకపోతోందని టీఆర్పీలు తేల్చేస్తున్నాయి.