బిగ్ బాస్ సీజన్8లో.. 12వ వారం నామినేషన్స్ ఓటింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ టైటిల్ విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ కు .. 12వ వారం నామినేషన్స్ వల్ల ఫుల్ నెగెటివిటీ వచ్చేసింది. 12వ వారం నామినేషన్స్ సోమ, మంగళవారం సాగిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ, నబీల్ ఐదుగురు ఉన్నారు.
ఈ వారం నాగ మణికంఠ నుంచి సింగిల్ నామినేషన్ ఓట్ వచ్చిన నబీల్ కూడా కూడా నామినేట్ అయ్యారు. అలాగే, అందరికంటే ఎక్కువగా టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్‌కు నామినేషన్స్ ఎక్కువ పడటంతో కాస్త ఎక్కువగానే డిజప్పాయింట్ అయ్యాడు. సోనియా ఆకుల, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, బేబక్క నలుగురు కూడా నిఖిల్‌నే నామినేట్ చేశారు.
ఇలా 12వ వారం నామినేషన్స్‌తో..బయట కూడా నిఖిల్ ఫుల్ నెగెటివిటీ తెచ్చుకున్నాడు. దీని ప్రభావంతో 20.51 శాతం ఓటింగ్‌తో నిఖిల్ రెండో స్థానంలోకి జారిపోయాడు. ఎప్పుడైనా బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్‌లో ఉండే నిఖిల్.. నెగెటివిటీ పెరగడంతో రెండో ప్లేస్‌కు పడిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్‌లో ఎవరూ ఊహించని విధంగా 24.56 శాతం ఓటింగ్‌తో ప్రేరణ నిలిచింది. మరో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నబీల్ నిఖిల్ తర్వాత 19.28 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. కోపిష్టిగా పేరు తెచ్చుకున్న పృథ్వీ 19.27 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా..యష్మీ గౌడ 16.38 శాతంతో ఐదో స్థానంలో ఉంది.
దీంతో పృథ్వీ, యష్మీ ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారని… కన్నడ బ్యాచ్‌కు చెందిన వీరిద్దరిలో ఎక్కువగా యష్మీనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.