బిగ్ బాస్ 8 సీజన్లో ఆడపులిగా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్‌లో యష్మీ గౌడ కూడా ఉంది.లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయింది. అయితే టాప్ 5 లో కచ్చితంగా ఉంటుందనుకున్న యష్మీ ఎలిమినేట్ అయ్యిందనే బాధలోనే ఉన్నారు ఆమె ఫ్యాన్స్.
అయితే ఫస్టులో బాగానే మార్కులు సంపాదించుకున్న యష్మీ…తర్వాత గ్రూపు గేములు ఆడటం, తన గేమ్ పై ఫోకస్ తగ్గించి నిఖిల్‌తో లవ్ ట్రాక్ నడపడం పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోయారు నెటిజన్లు. గత వారం కిర్రాక్ సీత ..యష్మీ టాపిక్‌ని తీసుకొచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యష్మీని.. ట్రాప్ లో పడేసి వాళ్ల గేమ్ ని డౌన్ చేస్తున్నావ్ అంటూ నిఖిల్ అనడం..దానికి యష్మీ సరైన స్టాండ్ తీసుకొని నిఖిల్ కోసం నిలబడకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది.
ఈ సంఘటనతోనే యష్మీ ఎలిమినేషన్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే యష్మీ అందగత్తె కావడం ఆమెకు ప్లస్ అయింది. ఈ సీజన్ పెద్దగా ఆసక్తికరంగా లేకపోయినా.. కేవలం యష్మీ కోసం షోని చూసే ఆడియన్స్ చాలా మంది ఉండేవారన్న టాక్ నడిచింది.
అయితే బిగ్ బాస్ సీజన్ 8లో.. ఆమె టాప్ 5 లోకి రాలేకపోయినా సినిమాల్లో, వెబ్ సిరీస్, సీరియల్స్ అవకాశాలు ఇప్పుడు యష్మీ కోసం క్యూలు కడుతున్నాయి. బిగ్ బాస్ షోలోకి రాకముందు స్వాతి చినుకులు, నాగ భైరవి, త్రినయని, కృష్ణ ముకుంద మురారి వంటి సీరియల్స్ చేసింది. స్వాతి చినుకులు, నాగభైరవి సీరియల్స్ లో యష్మీ హీరోయిన్ గా నటించగా.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో విలన్ గానూ మెప్పించింది.
తాజాగా ఇప్పుడు స్టార్ మా ఛానల్లో రెండు సీరియల్స్ లో యష్మీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అంతే కాదు ఆహా మీడియాలో ఒక వెబ్ సిరీస్ ఆఫర్ కూడా వచ్చినట్లు టాక్ నడుస్తోంది. వీటితో పాటు సినిమాల్లో కూడా కొన్ని అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ చాలామంది బయటకు వెళ్లినా ఎవరికీ రాని లక్ యష్మీకి రావడంపై ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి యష్మీ బంపర్ ఆఫర్ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.