బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ మెల్లమెల్లగా గీత దాటేస్తున్నారు. హౌస్‌లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువవుతున్నట్లు కనిపిస్తున్నాయి. మంగళవారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ రేషన్ కోసం మూడు గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ-యష్మి, సీత-నిఖిల్ మధ్య నడిచిన ఫర్టింగ్ రచ్చే ఎక్కువ ఆసక్తికరంగా మారిపోయింది.
యష్మిని నామినేట్ చేసిన మణికంఠ.. నామినేషన్స్ అయిన తర్వాత యష్మి దగ్గరకు వచ్చి ఐస్ చేయడానికి ప్రయత్నించాడు. నచ్చజెప్పడానికి చాలా ట్రై చేసిని వినపోవడంతో.. వెనక నుంచి యష్మిని హగ్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకుపడి వదిలెయ్ అని గట్టిగా చెప్పిన యష్మి.. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తూ బిగ్‌బాస్‌కి చెప్పింది.
ఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం రెండు గ్రూప్స్ కి బిగ్ బాస్ మూడు పోటీలు పెట్టాడు. ముందు ‘ఫొటో పెట్టు ఆగేటట్టు’ గేమ్‌లో శక్తి టీమ్ నుంచి పృథ్వీ, కాంతార టీమ్ నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్ గా వ్యవహరించింది. టీమ్ లీడర్స్ ఫోటోలని స్టాండ్‌లో పెట్టే ఈ పోటీలో.. నబీల్ విజేతగా నిలిచాడు. ‘నత్తలా సాగకు ఒక్కటీ వదలకు’ అని పెట్టిన రెండో పోటీలో… పాకుతూ క్యాబేజీలని మరో చోటకు చేర్చాలనే గేమ్ పెట్టగా.. ఇందులో నిఖిల్ శక్తి టీమ్ గెలిచింది.
అయితే రెండో గేమ్‌లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని చెబుతూ ఒకే జట్టుకి చెందిన ప్రేరణ.. మణికంఠపై ఫైర్ అయింది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి, తొక్కలో సంచాలక్ అని మణికంఠని గట్టిగా అడిగింది. సంచాలక్‌గా తప్పు చేశాడన్నట్లు ముందు మాట్లాడిన ప్రేరణ.. తర్వాత మాత్రం అతడి దగ్గరకు వెళ్లి అతడికి సారీ చెప్పింది.
‘బూరని కొట్టు రేషన్ పట్టు’ అని మూడో గేమ్ లో.. టీమ్ లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. దీనిలో భాగంగా ఒకరి ఒంటిపై అంటించిన బూరల్ని మరొకరు స్టిక్‌తో పగలగొట్టగా..చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్లు గెలిచినట్లు . అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా.. చివరకు బజర్ మోగేసరికి నిఖిల్‌ని విజేతగా ప్రకటించింది. దీంతో రేషన్ టాస్క్‌లో శక్తి టీమ్ విజేతగా నిలిచింది.
కొద్దిరోజులుగా యష్మి, సోనియాకు పడట్లేదన్న విషయం మరోసారి రుజవయింది. చివరగా పెట్టిన గేమ్‌లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని యష్మి కోప్పడింది. సోనియా చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగట్టిగా అరిచింది. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్‌ను డిక్లేర్ చేశావ్ అని ఫైర్ అయింది.
అయితే మంగళవారం ఎపిసోడ్‌లో పులిహోర కబుర్లు ఎక్కువయినట్లు కనిపించింది. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్‌తో అంది. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది. అలాంటిదేం లేదని యష్మీ చెప్పేసరికి తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయి.. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్లేదని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ-సోనియా మధ్య కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్ లాగే కనిపించింది. ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా? అని పృథ్వీని సోనియా అడిగింది. అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పేసరికి నవ్వేసింది.
ఇక రెండో గేమ్‌లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దు కూడా పెట్టేశాడు. అంతకు ముందు కిచెన్‌లోనూ సీత.. పృథ్వీని హగ్ చేసుకుంది. మొత్తంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్‌మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తోంది.