బిగ్ బాస్ సీజన్ 8 లో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన వారిలో బిగ్ బాస్ ఎందుకో మొదటి నుంచి కూడా అవినాష్ అంటే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది. వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్న సామెత గుర్తుకువచ్చేలా అవినాష్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకే స్క్రీన్ స్పేస్ అవినాష్ కి దొరికిన రేంజ్ లో మరో కంటెస్టెంట్ కి దొరకడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఎంటర్టైన్మెంట్ కోసం అవినాష్‌ను బిగ్ బాస్ అన్ని విధాలుగా వాడుకుంటున్నాడు. కిచెన్ టైమర్ పెంచాలంటే కచ్చితంగా అవినాష్ చేత టాస్క్ చేయించాల్సిందే అన్నట్లుగా బిగ్ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రాకముందు.. ఈ సీజన్ డిజాస్టర్ అన్న టాక్ తెచ్చుకుంది. గౌతమ్, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వంటి వారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయ్యాక బోలెడంత కంటెంట్‌ను ఇస్తున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీకి అయితే టీఆర్పీ రేటింగ్స్ బాగా వస్తుండటంతోనే.. బిగ్ బాస్ టీం అతన్ని పూర్తిగా వినియోగించుకుంటుంది.
ఇక నిన్న ఎపిసోడ్లో అవినాష్ భార్య అనూజ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది. ఈమె వచ్చే ముందు బిగ్ బాస్ టీం ఆమె కోసం చాలా సెటప్ చేశారు. ముందుగా.. హౌస్ మేట్స్ అందరూ బాగా అలిసిపోయారు, కాసేపు నిద్రపోండి అని పగలు పూట బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా పడుకొని ఉండగా, అవినాష్ భార్య అనూజ హౌస్ లోకి వచ్చి.. హౌస్ లోకి రాగానే నేరుగా అవినాష్ బెడ్ దగ్గరకు వెళ్లి పక్కనే పడుకుంటుంది. దీంతో అవినాష్ ఉలిక్కి పడి పైకి లేచి.. అకస్మాత్తుగా నా పక్కన వచ్చి పడుకుంది ఎవరబ్బా అని భయపడ్డానని అంటాడు అవినాష్. అప్పుడు టేస్టీ తేజ .. ఎవరని అనుకున్నావో చెప్పు.. నాకు తెలిసి నలుపు రంగు డ్రెస్ వేసుకుంది కాబట్టి యష్మీ అనుకున్నావ్ కదా అని సరదాగా అనడంతో.. దానికి అనూజ కూడా నవ్వుతుంది.
ఇదంతా అయ్యాక గార్డెన్ ప్రాంతంలో కాసేపు అనూజతో కలిసి మాట్లాడుతాడు అవినాష్. తర్వాత అవినాష్, అనూజని యాక్షన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్.. అక్కడ వాళ్లిద్దరి కోసం ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ ని ఏర్పాటు చేసి మరీ రుచికరమైన వంటకాలతో డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. అయితే హౌస్ లో మొదటి వారం నుంచి ఉంటున్న కంటెస్టెంట్స్ ని కూడ పక్కన పెట్టి, కేవలం అవినాష్ కి మాత్రమే ఇలాంటి స్పెషల్ ప్యాకేజీలు అని.. టీఆర్పీ కోసమేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.