బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్‌తో పాటు నిఖిల్, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఉండగా..వీరిలో యష్మి, పృథ్వీ, హరితేజ డేంజర్ జోన్‌లో ఉన్నారు.. ఈ ముగ్గురిలోనే ఇప్పుడు ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నామినేషన్స్‌లో ఉన్న వారిలో పృథ్వీకే తక్కువగా ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. నబీల్‌తోపాటు ఇతర కంటెస్టెంట్స్‌తో పృథ్వీ గొడవలు పడటం వల్ల అది అతడికి మైనస్‌గా మారినట్లు చెబుతోన్నారు. యష్మి, హరితేజలను బిగ్ బాస్ సేవ్ చేస్తాడని.. పృథ్వీని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని చెబుతోన్నారు. ఒకవేళ పృథ్వీని కనుక బిగ్ బాస్ సేవ్ చేస్తే.. హరితేజ ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు.
అంతేకాదు పృథ్వీతో పాటు గంగవ్వ కూడా బిగ్‌బాస్ హౌజ్‌ను వీడనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా గత సీజన్లోలాగే తనంతట తానుగా గంగవ్వ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు చెబుతోన్నారు. శనివారం ఎపిసోడ్‌లోనే గంగవ్వ ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి నామినేషన్ లేకుండానే గంగవ్వ బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వారం ఓటింగ్‌లో నిఖిల్‌తో, గౌతమ్ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే లోకల్ నాన్ లోకల్ కాన్సెప్ట్ గా.. కన్నడ వర్సెస్ తెలుగు అంటూ సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం గౌతమ్‌కు ఇప్పుడు ప్లస్సయినట్లు సమాచారం. ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఎపిసోడ్‌లో నిఖిల్, గౌతమ్ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకోవడంఈ వారం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.
కొన్నాళ్లుగా నిఖిల్‌ను మిగిలిన కంటెస్టెంట్స్ సైడ్ చేస్తున్నారు. కావాలనే టాస్క్‌ల్లో అతడిని నెగెటివ్ చేస్తున్నారు. అయినా బిగ్‌బాస్ ఫ్యాన్స్‌లో నిఖిల్ క్రేజ్ తగ్గడం లేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఓటింగ్‌లో అతడే లీడ్‌లో సాగుతుండగా..సెకండ్ ప్లేస్‌లో గౌతమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గౌతమ్ డేరింగ్, జెన్యూనిటీ భారీగా ఓటింగ్‌ను తెచ్చిపెట్టినట్లు అంటున్నారు. ఓటింగ్‌లో ప్రేరణ, విష్ణుప్రియ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.