ఈపీఎఫ్ చందాదారులకు అదనపు వడ్డీ! సీబీటీ తీసుకున్న కీలక నిర్ణయాలు మీకు తెలిసా?”

Extra Interest For EPF Members Key Decisions By CBT You Should Know, Extra Interest For EPF Members, Key Decisions By CBT, CBT Decisions You Should Know, Extra Interest For EPF, Amnesty Scheme, Central Board Of Trustees, EPF, EPF Members, Interest Calculation, EPFO, UAN Number, UMANG, EPFO Latest News, EPFO Latest Insurance Scheme, Employe Provident Funds Scheme, PF Amount, Employees, Governament Provident Funds, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సెటిల్‌మెంట్ సమయంలో చేసే వడ్డీ పేమెంట్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులకు అదనపు ప్రయోజనం కలగనుంది. ఇకపై క్లెయిమ్ సెటిల్‌మెంట్ తేదీ వరకు వడ్డీ లెక్కించనున్నారు. సెటిల్‌మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని సీబీడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, సెటిల్‌మెంట్ సమయంలో ఆ నెలలో 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించడం జరుగుతుంది. అయితే, ఇకపై అది మారనుంది. సెటిల్‌మెంట్ తేదీ వరకూ వడ్డీ చెల్లించనున్నారు.

ఈ కొత్త విధానంలో వడ్డీ లెక్కించడం ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగడం తో పాటు వారి నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా తగ్గుతాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అభిప్రాయపడింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో నవంబర్ 30వ తేదీన 236వ సీబీటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంలో ఈపీఎఫ్ఓకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని నిర్ణయాలకు ఈ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

మరోవైపు.. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకోకపోవడం, ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేస్తున్న కంపెనీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఈపీఎఫ్‌ఓ అమ్నెస్టీ స్కీమ్-2024ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఆయా కంపెనీలు పెనాల్టీలు ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించాలని కోరింది. ఆన్‌లైన్ డిక్లరేషన్ ద్వారా ఈ సదుపాయం అందించనున్నారని తెలుస్తోంది. బడ్జెట్‌లో ప్రకటించిన ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ ప్రయోజనాలు అందించే లక్ష్యంలో భాగంగా ఈనెలాఖరులోపు అమ్నెస్టీ స్కీమ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను పొడిగిస్తూ సీబీటీ నిర్ణయం తీసుకుంది. 2024, ఏప్రిల్ 28 నుండి అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చందాదారుడు మరణిస్తే ఈ స్కీమ్ ద్వారా రూ. 2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తారు. మరోవైపు.. దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునేలా సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తొలి దశ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు మరో 20 ప్రాంతీయ కార్యాలయాల్లో రెండో దశ చేపట్టనున్నారు. 2025, జనవరి 1 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీబీటీ సమావేశంలో నిర్ణయించారు.