బిగ్ బాస్ ప్లాన్‌ను తిప్పికొట్టిన గౌతమ్ కృష్ణ.. మెగా చీఫ్ టాస్క్‌లో సంచాలక్‌గా నూటికి నూరు మార్కులు

Gautham Krishna Foils Bigg Boss Plan, Bigg Boss Plan, Bigg Boss Plan Foils, Avinash, Bigg Boss House, Bigg Boss Voting, Gautham Krishna, Nabeel, Nikhil, Prerna, Prithvi, Rohini, Tasty Teja, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ వేసిన ప్లాన్‌ను తిప్పి కొట్టాడు గౌతమ్ కృష్ణ. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడినట్లు అయినట్లు అయింది. లాస్ట్ మెగా చీఫ్ టాస్క్‌లో తన తెలివితో నిజంగా మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ షో.. రియాలిటీ షో అయినా కూడా బీబీ టీమ్ చాలా వరకు ఫేవరిటిజం చూపిస్తుంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే గౌతమ్ కృష్ణ అంటున్నారు ఆడియన్స్.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ ఆటపరంగా అదరగొడుతున్నాడు. అయితే తనకు సంబంధించిన సీన్స్ అన్నీ ఎపిసోడ్స్‌లో ఎత్తేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు..గౌతమ్‌కు ఫాలోయింగ్ పెరుగుతుండటంతో దీనికి చెక్ పెట్టాలని చూశాడు బిగ్ బాస్. గౌతమ్‌ను నెగెటివ్ చేయడానికి ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌ను ఉపయోగించుకోవడానికి చూడగా.. గౌతమ్ దానిని తిప్పికొట్టాడు.

ఈ వారం సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌ను నిర్వహించగా.. ఈ టాస్క్‌లో యష్మీ, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజకి పోటీ పెట్టాడు బిగ్ బాస్. దీనికి సంచాలక్‌గా గౌతమ్‌ను నియమించాడు బిగ్ బాస్. హౌజ్‌లో కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతోందని గౌతమ్ పెద్ద వార్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

గ్రూప్ గేమ్ ఆడుతున్న కన్నడ బ్యాచ్‌కు చెందిన యష్మీ, పృథ్వీకి కాకుండా.. తనతోపాటు వైల్డ్ కార్డ్స్‌గా వచ్చిన రోహిణి, టేస్టీ తేజకు సపోర్ట్ చేస్తాడేమో అని గౌతమ్‌ను టెస్ట్ చేశాడు బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ అంచనాలకు భిన్నంగా.. ఎవరి వైపు పక్షపాతం చూపించకుండా సంచాలక్‌గా డ్యూటీ చేశాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 8.. నవంబర్ 21 ఎపిసోడ్‌లో ఫైనల్ మెగా చీఫ్‌ ఛాలెంజ్‌లో భాగంగా పట్టువదలని విక్రమార్కులు అనే టాస్క్ ఆడారు.

వీరంతా బ్లూ, రెడ్ ఇలా రంగులు ఉన్న డ్రమ్స్‌పై తాడు పట్టుకుని నిలబడగా… సంచాలక్ గౌతమ్ ..డైస్‌ను రోల్ చేసి అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్‌ను తీసేస్తాడు. దాంతో ఆ డైస్ పైన ఉన్న వాళ్లు వేలాడుతారు. ఎక్కువ సేపు వేలాడలేరు కాబట్టి టాస్క్ నుంచి అవుట్ అవుతారు. అయితే, ఈ టాస్క్‌లో రోహిణి, తేజకు గౌతమ్ సపోర్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, గౌతమ్ ఎలాంటి ఫేవరిజం చూపించకుండా ఆడి ఇటు బిగ్ బాస్ కు, అటు కన్నడ బ్యాచ్ కు షాక్ ఇచ్చి.. తనేంటో ప్రూవ్ చేసుకున్నాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.