వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిలో మొదటిరోజు నుంచి ఇప్పటి వరకు బాగా క్లోజ్ గా ఉంటున్నవారిలో ఒకరు ప్రేరణ , గౌతమ్ ఒకరుగా ఉంటున్నారు.
వీళ్లిద్దరు కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కాబట్టి, వీళ్ల మధ్య ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉన్నట్లే కనిపించేది. అయితే ఈ వారం ఆ బాండింగ్ కి బీటలు పడినట్టు అయింది.
ప్రేరణకి ఈ మధ్య గౌతమ్ చేసే పనులు నచ్చడం లేదు. అందుకే మెగా చీఫ్ అయిన తర్వాత గౌతమ్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుందా అన్నట్లుగా తయారయింది సీన్. రీసెంటుగా సీతాఫలం పండ్లు గౌతమ్ ఒక్కడే తిన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవ మొదలయింది. నాలుగు సీతాఫలం పండ్లు తినేసావు మిగిలిన ఒకటైనా తినొద్దు అందరం షేర్ చేసుకుందాం అన్నా తినేసి మళ్లీ సిగ్గు లేకుండా నవ్వుతున్నావ్ అని ప్రేరణ అంటుంది . గౌతమ్ దీనిని అంత సీరియస్ గా తీసుకోకుండా..సరే తప్పు చేసాను..ఏదోక పనిష్మెంట్ ఇవ్వు అని అంటాడు.
దీనిపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా సీతాఫలం తిన్నందుకు గౌతమ్ కి, స్వీట్ తిన్నందుకు నబీల్ కి పనిష్మెంట్ ఇవ్వమంటాడు. ప్రేరణ బాగా అలోచించి నబీల్ కి చాలా ఫన్నీ శిక్ష ఇచ్చి.. గౌతమ్ కి మాత్రం ప్రతీరోజు వంటింట్లో అంట్లన్నీ తోమాలని చెప్తుంది. నేనొక్కడినే అన్ని అంట్లు తోమాలా? అని గౌతమ్ అడగగా, సపోర్టుగా ఒకరిని ఇస్తానని అంటుంది ప్రేరణ.
ఇదంతా పక్కన పెడితే నిన్న ఎపిసోడ్ లో ఉదయం వంట చేయడానికి గిన్నెలు కావాలని..గౌతమ్ ని పిలిచి అంట్లు తోము అని ప్రేరణ ఆర్డర్ వేస్తుంది. అప్పుడు గౌతమ్ కచ్చితంగా చేస్తాను, కానీ తనకు ఎవరినో ఒకరిని సపోర్టు పంపమని అడుగుతాడు. సపోర్టు అవసరమయ్యేంత అంట్లు అక్కడ లేవని ప్రేరణ అంటే..అప్పుడు గౌతమ్ సపోర్టు లేకపోతే నేను ఈ పని చేయనని అంటాడు.
అయితే వీరిద్దరి మధ్య గొడవ జరగబోతుంది అనేది పసిగట్టిన రోహిణి, ఎందుకు ఈ విషయం లో గొడవ, నేను వస్తాను సపోర్టుగా పదా అని లోపలకు వెళ్తుంది. రోహిణి తో పాటు గౌతమ్ కూడా వెళ్లి వంటింట్లో అంట్లు తోముతూ ఉంటాడు. అయినా కూడా ప్రేరణ వంటింట్లోకి వెళ్లిన తర్వాత గౌతమ్ తో గొడవలు పెట్టుకుంటుంది. నేను మెగా చీఫ్ ని, నీకు శిక్ష ఇచ్చినప్పుడు కచ్చితంగా ఆ శిక్షని అంగీకరించి పని చేయాలంటుంది.
దీనికి కౌంటర్ గా నువ్వేదో నా మీద పగ పెట్టుకొని చేస్తున్నట్టు ఉందని.. ఇది కరెక్ట్ కాదని అంటాడు గౌతమ్. అలా వీళ్లిద్దరి మధ్య గొడవ పెరిగిపోతుంది. గౌతమ్ ఆవేశంగా బిగ్ బాస్ హిస్టరీ లోనే ప్రేరణ ని ది వరస్ట్ మెగా చీఫ్ అని అనగా.. దానికి ప్రేరణ ‘నువ్వు వరస్ట్ కంటెస్టెంట్ అని అంటుంది. నిన్న మొన్నటివరకూ బాగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు తగువులు పడటంతో వీరిద్దరి ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది గౌతమ్ ను సపోర్టు చేస్తుండగా.. మరికొంతమంది ప్రేరణకు మద్దతుగా నిలుస్తున్నారు.